Corona: ఆ గిరిజన గ్రామాల్లో వారంతా కరోనాను జయించారు.. తుమ్మలకు, వైద్య సిబ్బందికి కృతజ్క్షతలు తెలిపిన బాధితులు

Corona: కరోనా మహమ్మారి గత ఏడాదికి పైగా ప్రపంచ దేశాలను సైతం కుదిపేసింది. ఇక భారత్‌లో ఫస్ట్‌వేవ్‌లో కంటే సెకండ్‌వేవ్‌ తీవ్ర స్థాయిలో విజృంభించింది. కరోనా

Corona: ఆ గిరిజన గ్రామాల్లో వారంతా కరోనాను జయించారు.. తుమ్మలకు, వైద్య సిబ్బందికి కృతజ్క్షతలు తెలిపిన బాధితులు
Follow us
Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Jul 03, 2021 | 8:36 AM

Corona: కరోనా మహమ్మారి గత ఏడాదికి పైగా ప్రపంచ దేశాలను సైతం కుదిపేసింది. ఇక భారత్‌లో ఫస్ట్‌వేవ్‌లో కంటే సెకండ్‌వేవ్‌ తీవ్ర స్థాయిలో విజృంభించింది. కరోనా కట్టడిని లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయడంలో పాజిటివ్‌ కేసులు భారీగా తగ్గాయి. ఇక కరోనా మారుమూల గ్రామాలను సైతం వదిలిపెట్టలేదు. చివరకు గిరిజనులను సైతం వెంటాడింది. గిరిజన గ్రామాల్లో కరోనా బారిన పడితే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడి వైద్య సదుపాయాలు పెద్దగా ఉండవు. ఒక వేళ వైద్యం కోసం వెళ్లాలంటే చాలా దూరం వెళ్లాల్సిన దుస్థితి. అలాంటి గిరిజన ప్రాంతాల్లో కరోనా బారిన పడిన వారు కరోనాను జయించారు. వివరాల్లోకి వెళితే..

వారంతా నిరుపేదలు.. ఉండేది ఓ మారుమూల గ్రామాల్లో. కరోనా మహమ్మారి వెంటాడిన సుమారు 80 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. 15 రోజుల ఐసోలేషన్‌ తర్వాత వారంతా కరోనాను జయించారు. భద్రాది కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పరిధిలోని రెడ్యాలపాడు, దురదపాటు, గండుగులపల్లికి చెందిన వారికి 15 రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా, 80 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరంతా గిరిజన కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఇబ్బందులకు గురవకుండా గండుగులపల్లిలో ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. 80 మంది బాధితులకు దమ్మపేట డాక్టర్‌ శ్రీహర్ష వైద్యం అందించారు. వీరికి 15 రోజులపాటు భోజన సదుపాయాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్పించారు. జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాసాని నాగప్రసాద్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ బాధితులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాట్లు చేశారు. వీరికి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్‌ వచ్చింది. దీంతో వీరికి డాక్టర్‌ శ్రీహర్ష పలు సూచనలు చేశారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న బాధితులు మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు, పైడి వెంకటేశ్వరరావు, నాగప్రసాద్‌, బుచ్చిబాబు, సర్పంచ్‌ సుశీలరాజేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం వల్లే తాము కరోనా నుంచి బయటపడినట్లు తెలిపారు. తమకు కరోనా పాజిటివ్‌ వచ్చినా దూరం పెట్టకుండా అన్ని సదుపాయాలు కల్పించారని, తమకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించారని అన్నారు.

ఇవీ కూడా చదవండి:

Telangana Corona Cases: తెలంగాణలో అదుపులోనే కరోనా.. కొత్తగా నమోదు అయిన కేసుల కన్నా కోలుకున్న వారే ఎక్కువ!

Johnson and Johnson: మా వ్యాక్సిన్ సింగిల్ షాట్‌తో డెల్టా వైరస్‌ నుంచి రక్షణ.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కీలక ప్రకటన..!