AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannababu: “వియ్యంకుడు అఖండ.. కుమారుడు పప్పుండ..” చంద్రబాబుపై మంత్రి కన్నబాబు సంచలన వ్యాఖ్యలు

రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

Kannababu: వియ్యంకుడు అఖండ.. కుమారుడు పప్పుండ.. చంద్రబాబుపై మంత్రి కన్నబాబు సంచలన వ్యాఖ్యలు
Kannababu
Balaraju Goud
|

Updated on: Dec 11, 2021 | 7:46 PM

Share

AP Minister Kannababu: రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల ప్రమేయం తగ్గించామని పేర్కొన్నారు. అధిక వర్షాలతో కొన్ని జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటివరకూ 2,36,880 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 7వేలకు పైగా ఆర్బీకేలలో ధాన్యం సేకరణ ఏర్పాటు చేశామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా ఆర్బీకేల ద్వారా అమ్ముకునే వీలు కల్పించామని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో కొన్ని జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే ద్వారా ఇప్పటివరకూ 2,36,880 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 7,681 ఆర్బీకేలలో ధాన్యం సేకరణ ఏర్పాటు చేశామని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.

అన్నదాతల ద్వారానే కొనుగోలు చేసి, 21 రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆ పంటలకు ఎంఎస్పీ కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నాం. అధిక వర్షాల కారణంగా ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఎంఎస్పీ ఇవ్వటానికి మిల్లర్లు ముందుకు రాకపోవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ తీసుకున్నారన్నారు. రైతును కాపాడేందుకు జగన్ ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. ప్రతి ఆర్బీకేకి మిల్లులను అనుసంధానం చేశామన్న మంత్రి.. వర్షాల వల్ల తేమ శాతం ఎక్కువ ఉన్న ధాన్యాన్ని, ఆ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టి, కొనుగోలు చేస్తున్నామన్నారు.

ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలన్న ఆలోచనే తెలుగు దేశం పార్టీకి ఎప్పుడూ లేదని ఫైర్ అయ్యిన మంత్రి.. ఈరోజు రైతుల గురించి లేని ప్రేమను ఒకలబోస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం మీద యావ తప్ప.. రైతు సంక్షేమం ఎన్నడు పట్టలేదన్నారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారని, ఆయన “వియ్యంకుడు అఖండ.. కుమారుడు పప్పుండ..” అందుకే ఎలాగైనా పార్టీని బతికించుకోవాలని, భారం అంతా తాను మోయ్యాల్సి వస్తుందని బాబు తపన పడుతున్నాడు. మొన్న బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు పసుపు జెండా కప్పుకుని బీజేపీ తరఫున ఏజెంట్లుగా కూర్చున్నారని ఆరోపించారు.

రెండు నెలల క్రితమే బీజేపీకి ఏజెంట్లుగా పనిచేసిన పార్టీగా.. విభజన హామీల గురించి మీరు కేంద్రాన్ని ఎందుకు అడగరని మంత్రి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా నినాదాన్ని నీరుగార్చిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చరిత్ర ఉన్నంతకాలం ఆ హీన చరిత్ర బాబుదే అయ్యారు. విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అధికారం ప్రజలు ఆరోజు చంద్రబాబుకే ఇచ్చారు. ఆయన చేయాల్సినప్పుడు చేయకుండా, ఇప్పుడు పిల్లి శాపాలకు ఉట్టి విరిగిపడుతుందా.. మీ శాపాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంగారు పడిపోదు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి బలంగా ఉందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.

Read Also…  Viral Video: ప్రత్యేక డంబెల్స్‌తో వ్యాయామం చేస్తున్న కప్ప.. వీడియో చూస్తే మీరు అవాక్కవ్వాల్సిందే..