AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool district: ఒకేసారి తల్లి కొడుకుల్ని కాటేసిన పాము.. పాపం పసివాడు!

కర్నూలు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆడుకుంటున్న ఓ చిన్నారిని పాముకాటేసింది.

Kurnool district: ఒకేసారి తల్లి కొడుకుల్ని కాటేసిన పాము.. పాపం పసివాడు!
Snakebite
Ram Naramaneni
|

Updated on: Dec 11, 2021 | 6:58 PM

Share

కర్నూలు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆడుకుంటున్న ఓ చిన్నారిని పాముకాటేసింది. కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా పాముకాటు వేసింది. ఆస్పత్రికి తరలిస్తుండగా బాలుడు మృతువాతపడ్డాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని పేట్నికోటలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

వివరాల్లోకి వెళ్తే.. కొలిమిగుండ్ల మండలం పేట్నికోటకు చెందిన ఓబులమ్మ అనే మహిళ తన మూడేళ్ల కుమారుడు సాత్విక్‌తో ఇంటిముందు వాకిట్లో ఉన్నారు. బాలుడు ఆడుకుంటుండగా,  ఓబులమ్మ ఇంట్లోకి వెళ్లింది. అలా వెళ్లి రెండు నిమిషాలు గడవకముందే..బాలుడు గట్టిగా అరిచాడు. ఏం జరిగిందోనని వచ్చి చూసేసరికి..బాలుడి ముందు..ఓ పెద్ద విష సర్పం కనిపించింది. అది అప్పటికే ఆ బాలుడిని కాటేసింది. కొడుకు కాపాడుకోవాలనే ఆరాటంతో.. అక్కడికి వెళ్లిన ఓబులమ్మను కూడా పాము కాటేసింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై..ఇరువురిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో కుమారుడు సాత్విక్‌ మృతిచెందాడు. తల్లి ఓబుల్లమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాముకాటుతో మూడేళ్ల చిన్నారి మృత్యువాతపడగా, తల్లి ఓబులమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో పెట్నీకోట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: మత్తెక్కిస్తున్న ‘ఊ.. అంటావా.. ఊహూ అంటావా మావా’ సాంగ్.. యూట్యూబ్‌లో సెన్సేషన్

Andhra Pradesh: రైతు గుండె మండింది.. చెమటోడ్చి పండించిన పంటకు నిప్పుపెట్టాడు

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు