Leopards: కర్నూలు జిల్లాలో చిరుత పులుల సంచారం.. పశువులపై దాడి
ఆ కొండల్లోకి చిరుత పులులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియక తికమక పడుతున్నారు ప్రజలు. ఇంటి ముందు ఉన్న మేకలు, కుక్కలు, పశువులు పొట్టేళ్ళు పై దాడి చేసి చంపేస్తుంటాయి చిరుత పులిలు. చిరుత పులి దాడులతో కోసిగి ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్న ఫారెస్ట్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. కోసిగి తిమ్మప్పకొండ, మద్దెల గొట్టు, పులి కొండ..

తరచుగా జంట చిరుతలు కనిపిస్తూ ఉండటం పశువులు మేకలపై విరుచుకుపడుతూ ఉండటంతో స్థానికులు భయంతో గడుపుతున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో కొన్ని సంవత్సరాలుగా చిరుత పులులు సంచరిస్తున్నాయి. పగలురాత్రి వేళల్లో గొర్రెలు, మేకలు, పశువులు, కుక్కలు కోతుల పై చిరుతపులులు దాడి చేసి చంపేస్తున్నాయి. ఆ కొండల్లోకి చిరుత పులులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియక తికమక పడుతున్నారు ప్రజలు. ఇంటి ముందు ఉన్న మేకలు, కుక్కలు, పశువులు పొట్టేళ్ళు పై దాడి చేసి చంపేస్తుంటాయి చిరుత పులిలు. చిరుత పులి దాడులతో కోసిగి ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్న ఫారెస్ట్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.
కోసిగి తిమ్మప్పకొండ, మద్దెల గొట్టు, పులి కొండ, బసవన్న కొండ, గౌడగల్ కొండ ప్రాంతాల్లో చిరుతపులిలు సంచరిస్తున్నాయి. 80 సంవత్సరాల క్రితం కోసిగి ప్రజలు చిరుత పులులతో ఇబ్బంది పడుతున్న సమయంలో అప్పుడు ఉన్నటువంటి పెద్దలు, ఆ కొండలలో, రాతి పులి బోన్లు ఏర్పాటు చేసేవారు. అయితే రాతి పులి బోనులో చిక్కిన చిరుత పులిలను పట్టుకుని గ్రామంలో ఊరేగింపు చేసి దాన్ని చంపి తినేవారట. పులి చనిపోయిందని అప్పటి పెద్దలు ధైర్యంగా పొలం పనులకు వెళ్లేవారు. అప్పటినుంచి ఇప్పటివరకు చిరుత పులులు సంచరిస్తూనే ఉన్నాయి. చాలాసార్లు గొర్రెలు పశువులు కోతులు కుక్కలను చంపి తింటేనే ఉన్నాయి. పొలాలకు వెళ్లాలంటే ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని వెళ్లే పరిస్థితి ఉంది. ఎప్పుడూ మనుషులపై దాడి చేస్తావో తెలియని స్థితిలో భయాందోళనలో చెందుతున్నారు ప్రజలు.
15 రోజుల క్రితం మంత్రాలయం మండలం కగ్గల్ కొండపై చిరుతపులి కనపడింది. అక్కడ కూడా మేకలు గొర్రెల పై దాడి చేసింది. ఆ గ్రామ ప్రజలు కూడా భయముతో వణికిపోతున్నారు. వారు కూడా ఆ చిరుత పులిలను బంధించాలని పదేపదే కోరుతున్నారు. ఆ చిరుతపులులు ఎక్కడ నుంచి వచ్చి ఆ కొండల్లో చేరుతున్నాయో ఎవరికి తెలియదు. ఇప్పటికీ దాదాపుగా పదులు సంఖ్యల్లో చిరుతపులులు ఉన్నట్లు సమాచారం. దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి వందల సంఖ్యలో పెంపుడు జంతువులపై దాడి చేసి చంపి తింటున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఏ అధికారులు కూడా ఒక్క చిరుత పులిని కూడా బంధించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆ చిరుత పులిలను బోనులు సాయంతో పట్టుకొని జూలో వదలాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ రెండు నెలల్లో దాదాపుగా ఎన్నోసార్లు కనపడుతూనే ఉన్నాయి చిరుతపులులు. ఆ అధికారులు కూడా చూసి చూసినట్లు వ్యవహరిస్తున్నారు. నిన్న జరిగిన చిరుతపులి దాడిలో పొట్టేళ్లను చంపి వదిలేసి వెళ్లింది చిరుత పులి. తిరుపతిలో చిన్న పిల్లలపై చిరుతపులి దాడి చేసిన ఘటన చూసి కోసిగి మండలంలో కూడా చిన్న పిల్లలపై ఎప్పుడు దాడి చేస్తాయో తెలియదు అంటున్నారు కోసి ప్రజలు.
కర్నూలు జిల్లా కోసిగిలో నిన్న రాత్రి 12 గంటల సమయంలో చిరుత పులి కోసిగి తిమ్మప్ప కొండ పైనుంచి వచ్చి సత్యం అవ్వ ఆలయం పక్కన ఉన్నటువంటి దస్తగిరి గొర్రెల మందపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో కుక్కలు సాయంత చిరుత పులిని తరిమేశాడు. అలాగే పక్కనే ఉన్నటువంటి తిక్కయ్య గొర్రెల మందపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించింది. వారు కూడా బాణాసంచ పేల్చుడంతో, అక్కడి నుంచి, ఆ చిరుత పులి ఎల్లమ్మ గుడి పక్కన ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఇళ్ల మధ్యలోకి వెళ్లి, వీరారెడ్డి అనే వ్యక్తి తన ఇంటి ముందు ఉన్న గొర్రె పొట్టేలను, చిరుత పులి దాడి చేసి చంపేసిందని వీరారెడ్డి తెలిపారు.
అదే విధంగా కోసిగి మారెమ్మ దేవర కోసం ఇటీవలే సంతలో 20 వేల రూపాయలతో కొనుగోలు చేశానని ఆయన తెలిపారు. ఇప్పుడు గొర్రెపై దాడి చేసింది రేపు చిన్నపిల్లలపై కూడా దాడి చెయ్యదు అని గ్యారెంటీ ఏంటి అన్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు మేల్కొని చిరుత పులిలను బంధించి జూకు తరలించాలని వారు కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి