AP Weather: కూల్ న్యూస్.. ఏపీకి రెయిన్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
మార్చి 17, 18, 19 తేదీల్లో ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఎండలు ముదురుతున్న వేళ కూల్ న్యూస్ వచ్చింది. ఏపీకి రెయిన్ అలెర్ట్ ఇచ్చింది… భారత వాతావరణ విభాగం. తొలుత మార్చి 16 నుంచి వర్షాలు పడతాయి అనకున్నా.. ఒకరోజు ముందుగా అంటే బధవారం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతుందని తాజాగా వెల్లడించింది. జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా వానలు పడునున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమల్లో బుధవారం నుంచి 4 రోజులపాటు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. పలుచోట్ల ఓ మోస్తారు జల్లులు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది
17, 18, 19 తేదీల్లో విశాఖ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ, తూర్పు గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. పంటలు దెబ్బతినకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి