AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Health University: హెల్త్ యూనివర్శిటీ పేరు మళ్లీ మారింది.. ఇకపై ‘ఎన్టీఆర్‌’ యూనివర్సిటీయే!

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ బుధవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో మళ్లీ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా పేరు మర్చేందుకు మార్గం సుగమమం అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రేదశ్‌ రాష్ట్రంలో హెల్త్‌ యూనివర్సిటీ..

NTR Health University: హెల్త్ యూనివర్శిటీ పేరు మళ్లీ మారింది.. ఇకపై 'ఎన్టీఆర్‌' యూనివర్సిటీయే!
NTR Health University
Srilakshmi C
|

Updated on: Jul 25, 2024 | 3:23 PM

Share

అమరావతి, జులై 25: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ బుధవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో మళ్లీ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా పేరు మర్చేందుకు మార్గం సుగమమం అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రేదశ్‌ రాష్ట్రంలో హెల్త్‌ యూనివర్సిటీ తీసుకొచ్చిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌. దానికి ఆయన పేరు తొలగించి రాజశేఖర రెడ్డి పేరు పెట్టడంలో ఔచిత్యం ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. పైగా యూనివర్సిటీ పేరు మార్పు తరువాత ఇక్కడ కోర్సులు పూర్తిచేసిన విద్యార్ధులు ఇతర దేశాల్లో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. అసలు వారి వద్ద ఉన్నవి అసలైన సర్టిఫికెట్లా..? నకిలీవా? అనే అనుమానాలు తలెత్తడంతో, గందరగోళ పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు.

తాజా పరిణామంతో మళ్లీ పాత పేరు పెట్టడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లైందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం యూనివర్సిటీ పేరు మార్చే సమయంలో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులుగా చెప్పుకొనేవారు ఎందుకు అభ్యంతరం చెప్పలేదోనని అనుమానం వ్యక్తం చేశారు. అయితే వారందరి పేర్లు తాను సభలో చెప్పదలుచుకోవట్లేదని ఆయన అన్నారు. దీనితోపాటు ఎంతో చరిత్ర కలిగిన కడప జిల్లా పేరును కూడా గత ప్రభుత్వం మార్చిందంటూ మంత్రి సత్యకుమార్‌ మండిపడ్డారు.

తెలంగాణ తెలుగు యూనివర్సిటీలో ప్రవేశాలు ఇక రాష్ట్ర విద్యార్ధులకే పరిమితం

తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అనంతరం.. ఈ రెండు రాష్ట్రాల మధ్య పదేళ్ల పాటు కొనసాగిన ఉమ్మడి రాజధాని బంధానికి ఈ ఏడాది జూన్‌ 2వ తేదీతో తెరపడింది. దీంతో హైదరాబాద్‌ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కూడా తెలంగాణకే పరిమితం కానుంది. అయితే ఈ ఏడాది కూడా ప్రవేశాలు మీరే చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీకి లేఖ రాసింది. ఈ లేఖను తెలంగాణ రాష్ట్ర ఉన్నత శాఖ పరిశీలించి రాష్ట్ర పునర్‌ విభజన కమిటీ అడిటర్‌ జనరల్‌ పరిశీలనకు పంపించారు. అయితే అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తెలుగు యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కేవలం తెలంగాణకే ప్రవేశాలను పరిమితం చేస్తూ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం తెలుగు యూనివర్సిటీలో చేపట్టే ప్రవేశాలన్నీ ఇకపై తెలంగాణ విద్యార్ధులకే పరిమితం కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.