AP Republic Day: అన్నివర్గాల అభివృద్ధియే లక్ష్యం.. ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాలనః ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌

ఉగాది నుండే రాష్ట్రంలోని 26 కొత్త జిల్లాల నుండి పరిపాలన సాగనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

AP Republic Day: అన్నివర్గాల అభివృద్ధియే లక్ష్యం.. ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాలనః ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌
Ap Republic Day 2022
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 26, 2022 | 11:41 AM

Andhra Pradesh Republic Day Celebrations 2022: ఉగాది నుండే రాష్ట్రంలోని 26 కొత్త జిల్లాల నుండి పరిపాలన సాగనుందని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(Biswabhusan Harichandan) ప్రకటించారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో(Republic Day Celebrations 2022) భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నవరత్నాల పథక, విభజనతో కలిగిన ఆర్థికలోటు, కోవిడ్ సంక్షోభం, ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని కూగా గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వలోని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన 95 శాతం హామీలను నెరవేర్చిందని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యంగా పాలన సాగుతుందని గవర్నర్ తెలిపారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి స్వంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసిందన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద రూ. 13,500 కోట్ల సహాయాన్ని అందిస్తున్నామని, రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గవర్నర్ వెల్లడించారు. రైతులకు క్షేత్ర స్థాయిలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు.ఆమూల్ పాల వెల్లువ కింద రూ. 9,899 కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తున్నామన్నారు.రూ. 3,1777 కోట్లతో నాలుగు షిపింగ్ హర్బర్‌ల నిర్మాణాన్ని చేపట్టామని గవర్నర్ గుర్తు చేశారు.

అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా నవరత్నాల పథకం ఉందన్నారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్టుగా చెప్పారు. పేద, బడుగు, బలహీనవర్గాల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని గవర్నర్ తెలిపారు. మనబడి నాడు-నేడు కింద కొత్తగా స్కూల్స్, కాలేజీల రూపు రేఖలు మారాయని గవర్నర్ గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య అమలు చేస్తున్నామన్నారు. పేద విద్యార్ధులకు జగనన్న అమ్మఒడి పథకం బాసటగా నిలుస్తుందని గవర్నర్ తెలిపారు. జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్ధులకు ఎంతో ప్రయోజం దక్కుతుందన్నారు గవర్నర్. విద్యను భవిష్యత్తుకు పాస్‌పోర్టుగా తమ ప్రభుత్వం భావిస్తోందని గవర్నర్ తెలిపారు.

విద్యారంగం అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గోరుముద్ద పథకం ద్వారా విద్యార్ధులకు లబ్ది దక్కుతుందని చెప్పారు. అక్వా రైతులకు నాణ్యమైన సీడ్ అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు. విద్యారంగం అభివృద్దిపై ఇప్పటికే ప్రభుత్వం రూ. 34,619 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణాలను చెల్లిస్తున్నామన్నారు. YSR చేయూత ద్వావరా 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలకు సహాయం చేస్తున్నట్టుగా గవర్నర్ చెప్పారు. పొదుపు సంఘాల్లోని మహిళలకు సున్నా వడ్డీని అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. ప్రతి నెల 62 లక్షల మందికి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందిస్తున్నామని గవర్నర్ వివరించారు.

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు