Curfew in AP: సోమవారం నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..
Curfew in AP: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు...
Curfew in AP: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూని సడలించారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. మారిన సడలింపు నిబంధనలు ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆదివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. టెస్ట్, ట్రేస్, ట్రీట్, వ్యాక్సీన్, కోవిడ్ నిబంధనలు పాటించడం వంటి చర్యలను పక్కాగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కరోనా నియంత్రణకై ప్రభుత్వం రాష్ట్రంలో కర్ఫ్యూ విధిస్తూ వచ్చింది. తొలుత ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు సడలింపులు ఇచ్చి.. మిగతా సమయం అంతా కర్ఫ్యూ విధించారు.
కరోనా కొద్దిగా నియంత్రణలోకి రావడంతో.. సడలింపు వేళలలను మరో రెండు గంటల పాటు పెంచారు. అలా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఇచ్చి.. మిగతా సమయం అంతా కర్ఫ్యూ అమల్లో పెట్టారు. తాజాగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లుగా భావించిన సర్కార్.. కర్ఫ్యూను కేవలం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే పరిమితం చేసింది. ఈ మేరకు ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానుసారం ఆదివారం నాడు కర్ఫ్యూ వేళలలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జూన్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే.. ఈ కర్ఫ్యూ సడలింపు ఉత్తర్వులు తూర్పు గోదావరి జిల్లాకు మాత్రం వర్తించబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ప్రభుత్వం ఈ జిల్లాలో కర్ఫ్యూ వేళలలను సడలించలేదు. ఇంతకాలం కొనసాగినిట్లుగానే తూర్పు గోదావరి జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపు ఉంటుందన్నారు.
అయితే, కర్ఫ్యూ వేళలో అకారణంగా బయటకు వచ్చే వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలు చేసే బాధ్యతలను జిల్లాల కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, ఎస్పీలకు అప్పగించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Also read: