Ganga River : గంగామాత ఆవిర్భావ పర్వదిన వేళ రుషికేశ్ తీరంలో విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు ప్రత్యేక పూజలు
పవిత్రతకు మారుపేరు 'గంగానది' అని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ అన్నారు. గంగా నది దేవీ రూపంలో పూజలు అందుకుంటోందని ఆయన..
Swaroopanandendra swamy : పవిత్రతకు మారుపేరు ‘గంగానది’ అని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ అన్నారు. గంగా నది దేవీ రూపంలో పూజలు అందుకుంటోందని ఆయన తెలిపారు. గంగా తీరాన్ని సందర్శిస్తే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని వివరించారు. గంగామాత ఆవిర్భవించిన పర్వదినం భారతావనికే పుణ్యదినం అని స్వరూపానందేంద్ర స్వామి స్పష్టం చేశారు. గంగా మాత ఆవిర్భవించిన పర్వ దినాన్ని పురస్కరించుకొని రుషికేశ్‌లోని గంగా తీరంలో విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విశాఖ శారదా పీఠం పక్షాన గంగమ్మ తల్లికి చీరెను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హారతినిచ్చి, నమస్సుమాంజలులు సమర్పించారు. భారతావని సుభిక్షంగా ఉండాలని తాము ప్రార్థించామని స్వరూపానంద అన్నారు.