Navabrahma Temples: ఒక్కసారి దర్శిస్తే చాలు పోయిన అదృష్టాన్ని సైతం తిరిగి తెచ్చే ఆలయం
Navabrahma Temples: గద్వాల్ జిల్లాలోని అలంపూర్ చాలా పురాతన నవభ్రమ దేవాలయాలకు నిలయం. అమ్మ వారితో పాటు త్రిమూర్తులు వివిధ రూపాలలో కొలువైన బ్రహ్మాండ క్షేత్రం. అందమైన తుంగభద్ర నది పరుగులు, అడుగడుగునా కొలువై ఉన్న ఆధ్యాత్మికత మనను ఎంతోగాను ఆకట్టుకుంటుంది..మనస్సు పెట్టి చూడాలి గాని అదొక భూలోక బ్రహ్మాండం...
Updated on: Jun 20, 2021 | 2:11 PM

తుంగభద్ర మరియు కృష్ణలు ఆలంపూర్ సమీపంలో సంగమంలో ఉన్నారు, దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు . ఇక్కడ తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మభ్రామ్మ, బాలభ్రామ్మ, గరుడ బ్రహ్మ, కుమారభ్రమ, అర్కభ్రామ్మ, వీరభ్రమ మరియు విశ్వభ్రమ అనే నవ భ్రమ దేవాలయాలన్నాయి. ఈ దేవాలయలు శివుడికి అంకితం చేయబడ్డాయి

దక్షిణ భారతదేశంలోని వెలిసిన మొదటి సూర్య దేవస్థానం ఈ అలంపురం క్షేత్రం. 9వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు ఎర్ర ఇసుక రాయితో నిర్మించారు. ఈ ఆలయం త్రికూటాలయంగా ప్రసిద్ధిగాంచింది. మూడు మండపాల్లొ ప్రధాన దైవం సూర్యభగవానుడు. స్వామివారి ఇరువైపులా శివలింగాలు ఉన్నాయి

ఆలయ బయట ప్రాంగణంలో రాతి ధ్వజస్తంభ ప్రక్కనే దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి ఆలయం దర్శనమిస్తారు. ముఖమండపంలో విశాలమైన మండపంపై గౌరీశంకర్ కళ్యాణం అష్ట దిక్పాలకులు, దశావతారాలు, మూడు గర్భాలయాలపై కదంబ శైలి విమానాలు ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యానికి చెందిన కృష్ణదేవరాయ కాలం నాటి శాసనాలు కలిగిన నరసింహ ఆలయం కూడా ఉంది.

ఈ ఆలయంలో సప్తమాతృకలు గణపతి పరశురాముడు ముఖమండపం లో దర్శనమిస్తారు. మండప స్థంభం మీద కాలచూర్య రాజు భుజబల్ల మల్ల కాలంలో కర్ణాటకలో ప్రసిద్ధులైన వనిత ప్రముఖులు వేయించిన శిలాశాసనం ఉంది.

ప్రతి సంవత్సరం సూర్య కిరణాలు సూర్య భగవనుడి పాదాలను తాకుతాయి. రథసప్తమినాడు సూర్యప్రభ వాహనం లో పురపాలక పురవీధుల్లో అత్యంత మనోహరంగా స్వామవారిని ఊరేగిస్తారు. ఇక్కడ స్వామివారిని సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారని.. కీర్తి , సంప్దలు , పదవులు లభిస్తాయని భక్తుల విశ్వాసం.




