AP Exams: మరోసారి లోకేష్‌పై విరుచుకుపడ్డ మంత్రి ఆదిమూలపు.. ‘అందరికీ నీకున్నట్లు స్పాన్సర్లు ఉండరంటూ’ వ్యాఖ్య..
AP Exams: ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షల నిర్వహణపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని ప్రతి పక్షాలు, విద్యార్థి జీవితంలో పదో తరగతికి ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైందని ఎట్టి పరిస్థితుల్లో...
AP Exams: ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షల నిర్వహణపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని ప్రతి పక్షాలు, విద్యార్థి జీవితంలో పదో తరగతికి ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైందని ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తామని అధికార పక్షం ఇలా వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ నాయకుడు లోకేష్ పలు సందర్భాల్లో ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే దీనిపై ఘాటూగా స్పందిస్తున్న విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్.. ప్రతి పక్షాల తీరును ఖండిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి మరోసారి లోకేష్‌పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నారో లోకేష్‌కు ఉన్నట్టు విద్యార్ధులందరికీ చంద్రబాబు లాంటి తండ్రి లేడని చెప్పిన మంత్రి… విదేశాల్లో చదువుకునేందుకు సాయం చేసే సత్యంరామలింగరాజు లాంటి స్పాన్సర్లు కూడా ఉండరని విమర్శించారు. ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని కరోనా సెకండ్ వేవ్ మొదలైన దగ్గరనుంచి లోకేష్ నానా యాగీ చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇదిలా ఉంటే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. టెన్త్, ఇంటర్ పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తాం అని మంత్రి ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షలు రద్దయ్యాయని అడ్మిషన్లు చేసే ఇంటర్ కాలేజీలపై చర్యలు తీసుకుంటాం అని గతంలో హెచ్చరించారు. పరిస్థితులు అనుకూలిస్తే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించిన మంత్రి టెన్త్ పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదన్నారు. మరి ఏపీలో పరీక్షల నిర్వహణ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
Etela kamalapur tour : మూడు గ్రామాల్లో ఈటల రోడ్ షో.. శంభునిపల్లిలో హారతులిచ్చిన మహిళలు