Health: కడుపు ఉబ్బిపోయి.. తీవ్రమైన నొప్పితో ఆస్పత్రికెళ్ళిన వ్యక్తి.. స్కాన్ చేసి చూడగా షాక్..
సాధారణంగానే కిడ్నీలో రాళ్లు అంటే తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. ఒకసారి కిడ్నీలో రాళ్లు ఏర్పడితే.. అవి కరిగేంత వరకు నరకాన్ని అనుభవించాల్సిందే.
సాధారణంగానే కిడ్నీలో రాళ్లు అంటే తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. ఒకసారి కిడ్నీలో రాళ్లు ఏర్పడితే.. అవి కరిగేంత వరకు నరకాన్ని అనుభవించాల్సిందే. అయితే, చాలా మంది కిడ్నీల్లో రెండు లేదా మూడు రాళ్లు ఉంటాయి. మహా అయితే ఓ పదో, ఇరవైయో ఉంటాయనుకుందాం. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి కిడ్నీలో ఉన్న రాళ్లు చూసి డాక్టర్లే షాక్ అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 3 వేల రాళ్లను బయటకు తీశారు వైద్యులు. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలానికి చెందిన ఓ వృద్ధుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ స్థానికంగా ఉన్న ఆద్య ఆస్పత్రిలో చేరాడు. స్కానింగ్ చేసిన వైద్యులు.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వృద్ధుడికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు.. కిడ్నీలోని రాళ్లును తొలగించారు. దాదాపు 3వేల రాళ్లు బయటకు తీశారు వైద్యులు. ఇదే విషయాన్ని యూరాలజీ నిపుణులు డాక్టర్ టి. సనత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కీహోల్ సర్జరీ ద్వారా కిడ్నీ స్టోన్స్‌ని తొలగించినట్లు తెలిపారు. ఇంత భారీ స్థాయిలో రాళ్లు బయటపడటం చాలా అరుదు అని, ప్రస్తుతం రోగి ఆరోగ్య నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..