Andhra Pradesh: ఎన్టీఆర్ వారసులు ఎవరు?.. చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసిన డిప్యూటీ సీఎం..
Andhra Pradesh: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన కామెంట్స్ చేశారు.
Andhra Pradesh: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన కామెంట్స్ చేశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు భారతరత్న అవార్డుకు అర్హుడుని, మరి చంద్రబాబు ఎలా ఎన్టీఆర్ వారసుడు అవుతాడని ప్రశ్నించారు. బుధవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘‘ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.. 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు ఈ అంశంపై మాట్లాడలేదు? ఎన్టీఆర్ కు భారతరత్నా ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేకపోయారు?’’ అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు. ఎన్టీఆర్ వారసత్వంపైనా సంచలన కామెంట్స్ చేశారు డిప్యూటీసీఎం నారాయణ స్వామి. ఎన్టీఆర్‌కు వారసులు ఎవరో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన నిజమైన వారసులు ఏమయ్యారో చెప్పాలన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే తన కొడుకుతో కలిసి వేరే పార్టీ పెట్టుకోవాలని నారాయణ స్వామి సవాల్ విసిరారు. అంతేకాదు.. ఎన్టీఆర్‌కు వారసులు చంద్రబాబా? జూనియర్ తారకరామారావా? చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అంశంపై సంచలన కామెంట్స్ చేసిన ఆయన.. చంద్రబాబు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయగలడా? ఎన్టీఆర్ ఫోటో లేకుండా జనంలోకి రాగలడా? అంటూ సవాల్ విసిరారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై మాట్లాడని తెలుగుదేశం పార్టీ నేతలు.. కరెంట్ ఛార్జీల పెంపుపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు దమ్ముంటే, ప్రజలపై నిజంగానే ప్రేమ ఉంటే.. కేంద్రంపై పోరాటం చేయాలని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ పేరు పలికే అర్హత కూడా బాబుక లేదన్నారు. కొత్త పార్టీ ఎన్నికల్లో గెలిచే సత్తా చంద్రబాబు, లోకేష్‌కు ఉందా? అని సవాల్ విసిరారు నారాయణ స్వామి. ఎన్టీఆర్‌తో పాటు.. వైఎస్ఆర్ కు కూడా భారత రత్న అవార్డు ఇవ్వాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి డిమాండ్ చేశారు.
Also read:
Amit Shah: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లను విలీనంపై హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు!
Puzzle Challenge: ఇది కదా అసలైన ఛాలెంజ్.. ఈ ఫజిల్‌ను చేజ్ చేస్తే మీకన్నా జీనియస్ లేనట్లే!