Andhra Pradesh: మిస్టరీగా మారుతున్న మహిళ మర్డర్ కేసు.. హత్యలో కానిస్టేబుళ్ల ప్రమేయం పై ఆరా

కడప జిల్లా పోరుమామిళ్లలో మహిళ మర్డర్‌(Woman Murder) కేసులో సంచలనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యలో ఇద్దరు కానిస్టేబుళ్ల ప్రమేయం ఉండడం కలకలం రేపుతోంది. ఈ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకుని కడప పోలీసులు...

Andhra Pradesh: మిస్టరీగా మారుతున్న మహిళ మర్డర్ కేసు.. హత్యలో కానిస్టేబుళ్ల ప్రమేయం పై ఆరా
crime news
Ganesh Mudavath

|

Mar 30, 2022 | 7:12 PM

కడప జిల్లా పోరుమామిళ్లలో మహిళ మర్డర్‌(Woman Murder) కేసులో సంచలనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యలో ఇద్దరు కానిస్టేబుళ్ల ప్రమేయం ఉండడం కలకలం రేపుతోంది. ఈ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకుని కడప పోలీసులు విచారిస్తున్నారు. మున్నీసా దారుణ హత్య కేసును జిల్లా ఎస్పీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారుర. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. మహిళ దారుణ హత్యపై ఏపీ మహిళా కమిషన్‌(AP woman Commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను వెంటనే అరెస్టు(Arrest) చేసి, బాధితులకు న్యాయం చేయాలని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. కేసును 21 రోజుల్లో విచారించి, బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు. కడప జిల్లా పోరుమామిళ్లలో వివాహేతర సంబంధం నెపంతో షేక్‌ మున్నీ అనే మహిళను దారుణంగా హత్య చేశారు. నిర్బంధించి, హింసించి అంతమొందించారు. సోమవారం రాత్రి జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను మంగళవారం ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన షేక్‌ మున్నీసాకు కలసపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో మున్నీసా ఏడాదిగా కడప జిల్లా పోరుమామిళ్లలోని సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నారు. అక్కడే గది అద్దెకు తీసుకుని తల్లి షకీలాతో ఉంటున్నారు. సూపర్‌మార్కెట్‌ యజమాని మాబు హుస్సేన్‌తో మున్నీ సన్నిహితంగా మెలిగినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై రెండు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. మున్నీ ఐదు నెలల క్రితం సూపర్‌మార్కెట్‌లో పనిమానేసి.. గిద్దలూరులో ఉంటున్నారు. అయినప్పటికీ మాబు హుస్సేన్‌ కుటుంబంలో గొడవలు ఎక్కువయ్యాయి.

దీనంతటికీ మున్నీనే కారణమని భావించిన మాబు హుస్సేన్‌ కుటుంబసభ్యులు.. కానిస్టేబుళ్లు సయ్యద్‌, జిలానీలను వెంటబెట్టుకుని సోమవారం సాయంత్రం గిద్దలూరు వెళ్లారు. ఆమెను వాహనంలో ఎక్కించే సమయంలో కానిస్టేబుళ్లు కాళ్లతో తన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతురాలి తల్లి షకీలా పేర్కొన్నారు. వాహనంలో మున్నీని కొట్టుకుంటూ తీసుకెళ్లిన కానిస్టేబుళ్లు ఆమెను మాబు హుస్సేన్‌ నివసించే వీధిలో పడేశారు. తర్వాత మరికొందరితో కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టి గాయపరిచారు. ఆ గాయాలతోనే ఆమె మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ తర్వాత నిందితులు… మున్నీని కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు.

ఇవీ చదవండి.

Samsung Freestyle Projector: ఇంటిని థియేటర్‌గా మార్చేసే గ్యాడ్జెట్‌.. సామ్‌సంగ్‌ నుంచి అదిరిపోయే ప్రొజెక్టర్‌..

KTR: మినిస్టర్ కేటీఆర్‌ పక్కన కిర్రాక్ లుక్‌తో ఉన్న ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టగలరా..?

Tirumala: శ్రీవారి భక్తులకు TTD కల్పిస్తున్న పలు ఉచిత సేవలు ఏంటో తెలుసా?.. పూర్తి వివరాలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu