AP Corona Cases: ఏపీ కరోనా బులెటిన్ విడుదల.. గడిచిన 24 గంటల్లో 22,399 పాజిటివ్ కేసులు నమోదు..

AP Corona Cases: ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నాయి. తాజా రాష్ట్ర వ్యాప్తంగా 22,399 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని...

AP Corona Cases: ఏపీ కరోనా బులెటిన్ విడుదల.. గడిచిన 24 గంటల్లో 22,399 పాజిటివ్ కేసులు నమోదు..
Ap Corona Cases
Follow us
Shiva Prajapati

|

Updated on: May 13, 2021 | 7:49 PM

AP Corona Cases: ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నాయి. తాజా రాష్ట్ర వ్యాప్తంగా 22,399 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. అధికారిక లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 96,446 శాంపిల్స్ సేకరించగా.. వీరిలో 22,399 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో రికవరీల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 18,638 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,66,785 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,01,042 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 11,56,666 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 9,077 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 2,080, చిత్తూరు-2,646, తూర్పు గోదావరి-3,372, గుంటూరు – 2,141, కడప – 1,447, కృష్ణా – 910, కర్నూలు – 1,365, నెల్లూరు – 1,589, ప్రకాశం – 1,489, శ్రీకాకుళం – 824, విశాఖపట్నం – 2,064, విజయనగరం – 896, పశ్చిమ గోదావరి – 1,576 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Also read:

Corona Antibodies: కొవిడ్‌ విజేతల్లో 8 నెలల పాటు యాంటీబాడీలు.. తాజా ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి

ఇండియ‌న్ రైల్వే ఇంటిగ్ర‌ల్ కోచ్ ఫ్యాక్ట‌రీలో పారామెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

ఇర్ఫాన్ పఠాన్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌.. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం..