AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: వారి కోసం జనసేనలోని కాపు నేతలు పని చేయకండి.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

కాపులు సీఎం కావాలనుకోవడంలో తప్పు లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి లో వైసీపీ మండపేట నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట..

CM Jagan: వారి కోసం జనసేనలోని కాపు నేతలు పని చేయకండి.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Cm Ys Jagan
Ganesh Mudavath
|

Updated on: Nov 02, 2022 | 8:44 PM

Share

కాపులు సీఎం కావాలనుకోవడంలో తప్పు లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి లో వైసీపీ మండపేట నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులును ప్రకటించినట్లు చెప్పారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆయన్ను గెలిపించాలని నియోజకవర్గ నేతలకు సీఎం జగన్  సూచించారు. గవర్నర్ కోటాలో గవర్నర్ ను ఒప్పించి తనకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించారన్న త్రిమూర్తులు.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎవరిని గెలిపించాలనే విషయమై ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఒటు వేయాలని పిలుపునిచ్చారు. – ఎవరెన్ని చేసినా తిరిగి వైసీపీ అధికారంలోనికి వస్తుందన్నారు. తనపై ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని తోట త్రిమూర్తులు అన్నారు. కాపులు సీఎం కావాలని ఆశపడటంలో తప్పులేదని, ఎవరికో సీఎం పదవిని కట్టబెట్టేలా జనసేన లోని కాపు నేతలు పనిచేయకూడదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కింద పదిశాతం రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. కాపులకు నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే జీవో జారీ చేయగా అమలులో చిన్న సమస్యలు ఉన్నాయని, కాపులకు ఐదు శాతం కంటే ఎక్కువగా రిజర్వేషన్ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నలు వివరించారు.

కాగా.. గతంలోనూ కాపు నేతల ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలోని కాపు నేతలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రులు తీవ్రంగా ఖండించారు. టీడీపీ హయాంలో కాపుల పరిస్థితి, వైసీపీ పాలనలో కాపుల పరిస్థితిని బేరీజు వేసుకుని మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,824 కోట్లు సహాయం అందితే.. ఈ మూడున్నరేళ్లలో రూ.26,490 కోట్ల లబ్ది చేకూరిందని చెప్పారు. చంద్రబాబు కోసమే జనసేన అధ్యక్షుడు పని చేస్తున్నారని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేయగలరా అని ప్రశ్నించారు.

అయితే.. ఈ విమర్శలకు జససేన తిప్పికొట్టింది. తనదైన స్టైల్ లో రీ కౌంటర్‌ ఇచ్చింది. వైసీపీ నుంచి కాపుల్లో ఎవరినైనా సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ము ఉందా ఆ పార్టీ నేతలు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మరోవైపు కాపుల అంశంపై చర్చించేందుకు త్వరలోనే విజయవాడలో భేటీ కావాలని వైసీపీ నేతలు నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..