AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సీఎం జ‌గ‌న్ విశాఖ షిఫ్టింగ్ ద‌స‌రాకు లేన‌ట్లే.. మరి ఎప్పుడంటే..?

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ‌ప‌ట్నంకు మాకం మార్చడం ఆల‌స్యం కానుంది. విజ‌య‌ద‌శ‌మికి విశాఖ‌ప‌ట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల‌యం ప్రారంభిస్తార‌ని.. అక్కడి నుంచే పాల‌న చేస్తార‌ని గ‌తంలో వైసీపీ నేత‌లు ప్రక‌టించారు.. దానికి త‌గ్గట్లుగా ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి విశాఖ రాక‌కోసం వికేంద్రీక‌ర‌ణ జేఏసీ కూడా విశాఖ‌ప‌ట్నంలో భారీ స్వాగ‌త ఏర్పాట్లు చేయాల‌ని స‌మావేశం కూడా పెట్టుకుంది. మూడు ప్రాంతాల అభివృద్ది మా ల‌క్ష్యం..

Andhra Pradesh: సీఎం జ‌గ‌న్ విశాఖ షిఫ్టింగ్ ద‌స‌రాకు లేన‌ట్లే.. మరి ఎప్పుడంటే..?
CM YS Jagan Camp Office
S Haseena
| Edited By: |

Updated on: Oct 14, 2023 | 1:59 PM

Share

విజయవాడ, అక్టోబర్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ‌ప‌ట్నంకు మాకం మార్చడం ఆల‌స్యం కానుంది. విజ‌య‌ద‌శ‌మికి విశాఖ‌ప‌ట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల‌యం ప్రారంభిస్తార‌ని.. అక్కడి నుంచే పాల‌న చేస్తార‌ని గ‌తంలో వైసీపీ నేత‌లు ప్రక‌టించారు.. దానికి త‌గ్గట్లుగా ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి విశాఖ రాక‌కోసం వికేంద్రీక‌ర‌ణ జేఏసీ కూడా విశాఖ‌ప‌ట్నంలో భారీ స్వాగ‌త ఏర్పాట్లు చేయాల‌ని స‌మావేశం కూడా పెట్టుకుంది. మూడు ప్రాంతాల అభివృద్ది మా ల‌క్ష్యం అంటూ ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌దేప‌దే చెబుతున్నారు. ఇక విశాఖ‌ప‌ట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల‌యం ఏర్పాటుచేసి అక్కడి నుంచే స‌మీక్షలు కూడా చేయ‌డం ద్వారా స‌మ‌గ్రాభివృద్ది ల‌క్ష్యాన్ని ప్రజ‌ల్లోకి తీసుకెళ్లిన‌ట్లు అవుతుంద‌ని కూడా భావించారు. ఇక వైఎస్సార్ సీపీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి వంటి ముఖ్య నేత‌లు కూడా సీఎం విశాఖ‌కు షిఫ్ట్ అవుతున్నార‌ని చెప్పారు…దీంతో ద‌స‌రా శ‌ర‌న్నవ‌రాత్రుల చివ‌ర్లో అంటే అక్టోబ‌ర్ 23న సీఎం క్యాంపు కార్యాల‌యం లో గృహ‌ప్రవేశం చేసి 24 వ తేదీనుంచి అక్కడి నుంచే ప‌రిపాల‌న చేస్తార‌ని కూడా చెప్పారు. దీంతో ఇక ద‌స‌రాకు అమ‌రావ‌తి నుంచి విశాఖ‌ప‌ట్నంకు సీఎం షిఫ్ట్ అవుతార‌ని జోరుగా ప్రచారం జ‌రిగింది. తాజా ప‌రిస్థితుల‌తో సీఎం విశాఖ నుంచి పాల‌న చేయ‌డం మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌ని తెలిసింది. అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు షిఫ్టింగ్ ద‌స‌రాకు లేన‌ట్లే అని ప్రభుత్వ వ‌ర్గాలు స్పష్టం చేసాయి. కొన్ని కార‌ణాల‌తో వాయిదా త‌ప్పడం లేద‌ని చెబుతున్నాయి.

నవంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో వైజాగ్‌కు మారే చాన్స్..

ముఖ్యమంత్రి విశాఖ‌ప‌ట్నం నుంచి పాల‌న సాగించేందుకు అక్కడ పూర్తి స్థాయిలో వ‌స‌తుల క‌ల్పన పూర్తికాలేదు. దీంతోనే ద‌స‌రాకు సీఎం క్యాంపు కార్యాల‌యం ప్రారంభోత్సవం వాయిదాప‌డింద‌ని అధికారులు చెబుతున్నారు. విశాఖ‌ప‌ట్నంలో ఉన్న రుషికొండ‌పై సీఎం క్యాంపు కార్యాల‌యం నిర్మాణం జ‌రుగుతుంది. ముందుగా ద‌స‌రా నాటికి ఈ భ‌వ‌నంలో అన్ని మౌళిక‌వ‌స‌తులు పూర్తి చేసి అప్పగించాల‌ని కోరిన‌ప్పటికీ. సాధ్యం కాక‌పోవ‌డంతోనే వాయిదా త‌ప్పడం లేదంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం సీఎంతో పాటు అధికారులు కూడా విశాఖ‌ప‌ట్నంలో ఉండి స‌మీక్షలు చేయాల్సిన అవ‌స‌రం ఉందంటూ రెండు జీవోలు జారీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి వ‌స‌తి సౌక‌ర్యం చూసేందుకు ముగ్గురు అధికారుల‌తో క‌మిటీ కూడా నియ‌మించింది. మున్పిప‌ల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి, సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ కార్యద‌ర్శుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది. విశాఖ‌లో మంత్రులు, అధికారులు ఉండేందుకు వీలుగా కావ‌ల్సిన వ‌స‌తి ఏర్పాట్లు చూడాల‌ని క‌మిటీకి ఆదేశించింది. దీంతో ఈ క‌మిటీ వెంట‌నే ప‌ని కూడా ప్రారంభించింది.

మంత్రులు, శాఖ‌ల వారీగా ఎంతెంత మేర స్థలం అవ‌స‌రం, భ‌వ‌నాలకు సంబంధించిన వివ‌రాలు సేక‌రిస్తుంది. ఈ క‌మిటీ పూర్తి స్థాయిలో నివేదిక సిద్దం చేసిన త‌ర్వాత ప్రభుత్వానికి వివరాలు అందించ‌నుంది. ఇప్పటికే విశాఖ‌ప‌ట్నంల‌లో అనుకూలంగా ఉండే భ‌వ‌నాల ఎంపిక కూడా చేస్తుంది. సీఎం కార్యాల‌య సిబ్బందితో పాటు సీఎస్, మంత్రులు,కార్యద‌ర్శుల‌కు అవ‌స‌ర‌మైన వ‌స‌తి చూసిన త‌ర్వాతే ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ‌లో మ‌కాం వేస్తార‌ని తెలుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ భ‌వ‌నం నిర్మాణంతో పాటు ఇత‌ర వ‌స‌తులు చూసేందుకు మ‌రో నెల రోజులు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాతే ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాల‌న చేస్తార‌ని అధికారులు చెబుతున్నారు. న‌వంబ‌ర్ నెలాఖ‌రు లేదా డిసెంబ‌ర్ లో సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు షిఫ్ట్ అయ్యే అవ‌కాశాలున్నట్లు తెలిసింది.

విశాఖ‌తో పాటు ఉత్తరాంధ్ర అభివృద్దిపై సీఎం జ‌గ‌న్ ఫోక‌స్..

ఉత్తరాంధ్ర ప్రాంతం బాగా వెనుక‌బ‌డి ఉంద‌ని.. ఆ ప్రాంతం అభివృద్దికి ప్రత్యేక చ‌ర్యలు తీసుకోవ‌ల్సి ఉంద‌ని ప్రభుత్వం చెబుతుంది. విశాఖ షిఫ్టింగ్ కు సంబంధించి జారీ చేసిన జీవోల్లో సైతం ఇదే అంశాన్ని పొందుప‌రిచింది ప్రభుత్వం. ఆంధ్రప్ర దేశ్ పున‌ర్వవ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలో కూడా వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చ‌ర్యలు తీసుకోవాల‌ని పేర్కొన్నార‌ని.. అందుకే విశాఖలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులు బ‌స చేసి స‌మీక్షలు చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు సీఎం జ‌గ‌న్ ఈ విష‌యంలో ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నట్లు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..