AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ కమలంలో కోల్డ్ వార్.. ఎవరికి వారే యమునా తీరే..

ఏపీ బీజేపీలో మింగుడుపడని వివాదాలు.. పార్టీ అధ్యక్షుడి నుంచీ సైలెన్స్‌ తప్ప నో ఆన్సర్‌.. ముఖ్యుల నుంచే వస్తున్న కామెంట్స్‌కి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి.. నో కామెంట్ అంటూ ఎప్పటికప్పుడు వెళ్లిపోతున్న..

Andhra Pradesh: ఏపీ కమలంలో కోల్డ్ వార్.. ఎవరికి వారే యమునా తీరే..
Ap Bjp
Ganesh Mudavath
|

Updated on: Feb 18, 2023 | 1:58 PM

Share

ఏపీ బీజేపీలో మింగుడుపడని వివాదాలు.. పార్టీ అధ్యక్షుడి నుంచీ సైలెన్స్‌ తప్ప నో ఆన్సర్‌.. ముఖ్యుల నుంచే వస్తున్న కామెంట్స్‌కి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి.. నో కామెంట్ అంటూ ఎప్పటికప్పుడు వెళ్లిపోతున్న సోమువీర్రాజు.. అవును.. రెండు మూడు రోజులుగా ఏపీ బీజేపీలో నడుస్తున్న స్పందనలెస్ పాలిటిక్స్ ఇవి. కన్నా రాజీనామా, జీవీఎల్ కామెంట్స్‌, జీవిఎల్‌కి పురంధేశ్వరి కౌంటర్స్ ఇవన్నీ పార్టీని ఇరుకున పెట్టే విషయాలే. వీటికి పార్టీ అధ్యక్షుడుగా ఉన్న సోము స్పందిస్తారని ఎవరైనా ఆశిస్తారు. కానీ.. ఆయన నుంచి నో రియాక్షన్‌. ఇవాళ ప్రకాశం జిల్లా టూర్‌కి వెళ్లారు సోము వీర్రాజు. అక్కడ కనిపించిన రియాక్షన్ ఇది. కన్నా, జీవీఎల్, పురంధేశ్వరి విషయంలో టీవీ9 ప్రతినిధి అడిగిన ప్రశ్నను దాటేస్తూ వెళ్లిపోయారు సోము వీర్రాజు.

కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తూ ఇద్దరే ఇద్దరు వ్యక్తుల్ని టార్గెట్ చేశారు. ఒకటి సోమువీర్రాజు, రెండు జీవీఎల్‌. ఆ రోజు కన్నా రాజీనామా తర్వాత కూడా సోము స్పందించాల్సి వచ్చినా.. మీడియా ప్రశ్నలకు స్పందించినా.. అయన నుంచి మాత్రం సరైన స్పందన రాలేదు.. సోము మాత్రమే కాదు.. పార్టీలో జరిగే పరిణామాలకు ఎవరి నుంచీ సరైన స్పందన లేదు. కన్నా రాజీనామా చేసిన వెంటనే.. ఆయన ఆరోపణలపై జీవీఎల్‌ను ప్రశ్నిస్తే.. అక్షరాలా 12 సార్లు దండం పెట్టారుగానీ.. వెంటనే రియాక్షన్ అయితే లేదు. ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లోనూ అధిష్టానం చూసుకంటుందని చెప్పారంతే!.

కాగా.. బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కన్నా రాజీనామా లేఖను పంపారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు కన్నా వెల్లడించారు. ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం కన్నా రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. కాగా.. కన్నా టీడీపీలో కానీ జనసేన పార్టీలోకి కానీ వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏ పార్టీలో చేరేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..