Andhra Pradesh: చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. కౌంట్‌డౌన్ మొదలైందంటూ సర్కార్‌కు వార్నింగ్..

పోలీసుల ఆంక్షలు.. అడ్డంకులు దాటుకుని అనపర్తి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. పోలీసుల సహాయ నిరాకరణకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చేసే పోరాటంలో వెనకడుగు వేసేది లేదన్నారు.

Andhra Pradesh: చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. కౌంట్‌డౌన్ మొదలైందంటూ సర్కార్‌కు వార్నింగ్..
Chandrababu
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 17, 2023 | 10:08 PM

పోలీసుల ఆంక్షలు.. అడ్డంకులు దాటుకుని అనపర్తి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. పోలీసుల సహాయ నిరాకరణకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చేసే పోరాటంలో వెనకడుగు వేసేది లేదన్నారు. అంతకుముందు టీడీపీ నేతల ఆందోళన.. పోలీసుల లాఠీఛార్జ్‌తో పరిస్థితి సీరియస్‌గా మారింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు సభపై పోలీసుల ఆంక్షలు విధించారు. కాన్వాయ్‌కి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డుపై సభకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు బారికేడ్లను పూర్తిగా పక్కకు లాగిపడేశారు. చంద్రబాబు కాన్వాయ్‌కి రూట్‌ క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో టెన్షన్ పరిస్థితి నెలకొంది.

పోలీసుల బస్సును టీడీపీ శ్రేణులు కాల్వలోకి తోసే ప్రయత్నం చేశారు. రాళ్ల దాడికి దిగారు. ఎదురుగా ఉన్న వాళ్లందర్నీ తోసేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి కార్యకర్తల్ని చెదరగొట్టారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు కాలినడకన బయల్దేరారు. టీడీపీ నేతలు చినరాజప్ప, నల్లమిల్లి శేషారెడ్డి సహా భారీగా కార్యకర్తలు చంద్రబాబు వెంట నడిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇవి కూడా చదవండి

రోడ్‌ షోకి నిన్న అనుమతి ఇచ్చి ఇవాళ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు చంద్రబాబు. రౌడీరాజ్యం అంతం చేసేందుకు కౌంట్‌డౌన్ మొదలైందని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు పెద్దాపురం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలోనే మాజీ హోంమంత్రి చిన్నరాజప్పకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్ల నినాదాలు చేశారు. వేట్లపాలెం గ్రామంలో బొట్టు భాస్కర రామారావు విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు చంద్రబాబు. ఆ సమయంలోనే చినరాజప్పకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. చిన్నరాజప్ప వద్దంటూ నినాదాలు చేశారు.

దేవిచౌక్‌కి చంద్రబాబు చేరుకోకముందే పోలీసులు భారీగా మోహరించారు. పరిసర ప్రాంతాల్లో దుకాణాలు మూసివేయించారు. అయితే మాట్లాడేందుకు అనుమతి లేదంటూ చంద్రబాబు నుంచి పోలీసులు మైక్‌ లాక్కున్నారు. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..