Telangana: కేంద్రమంత్రి నిర్మల విమర్శలు.. పాయింట్ టు పాయింట్ ఆన్సర్‌తో కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు..

తెలంగాణలో మెడికల్ కాలేజీల అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు. గజ్వేల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..

Telangana: కేంద్రమంత్రి నిర్మల విమర్శలు.. పాయింట్ టు పాయింట్ ఆన్సర్‌తో కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు..
Harish Rao
Follow us

|

Updated on: Feb 17, 2023 | 9:56 PM

తెలంగాణలో మెడికల్ కాలేజీల అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు. గజ్వేల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నిర్మలా సీతారామన్ చేసిన ప్రతి ప్రశ్నకు ధీటైన జవాబిచ్చారు. హైదరాబాద్‌కు వచ్చి మరీ మాట్లాడారని, కానీ, ఆవిడ మాటల్లో నిజాయితీనే లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గోరంత చెప్పుకునేది మాత్రం కొండంత అని దుయ్యబట్టారు.

మంత్రి హరీష్ రావు కామెంట్స్ యధావిధిగా..

‘‘నిన్న హైదరాబాద్ లో కేంద్రమంత్రి మాటల్లో నిజాయితీ లేదు. కేంద్రం తెలంగాణ కు ఇచ్చింది గోరంత చెప్పేది మాత్రం కొండంత ఉంటుంది. దేశంలో నెలకొన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పూర్తి ఆధారాలతో మాట్లాడారు. వాస్తవాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్తే కేంద్ర మంత్రులను నిద్ర పట్టడం లేదు. మెడికల్ కళాశాల గూర్చి కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఒక మంత్రేమో ప్రతిపాదనలు రాలేదంటారు. మరొకరేమో 9 కాలేజీలు ఇచ్చామంటారు. ఇక వరంగల్‌కి కేటాయించాలని ప్రతిపాదనలు అందాయని నిర్మల సీతారామన్ చెప్తున్నారు. కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కళాశాలలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ, ఇవ్వలేదు. వేరే రాష్ట్రాలకు ఒక నీతి తెలంగాణకు ఒక నీతా? మెడికల్ కళాశాలలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రశ్నిస్తున్నాం. తెలంగాణకు రావాల్సి నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫైనాన్స్ కమిషన్ నిర్ణయాలను తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. జీఎస్టీ నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి నిధులను ఇచ్చి తెలంగాణకి ఎందుకు ఇవ్వరు. ఆంధ్రాకి, తెలంగాణ ఒక్కో నీతి ఉంటుందా?’’ అని కేంద్రం తీరును ఎండగట్టారు మంత్రి హరీష్ రావు.

‘‘తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 293 కి లోబడి అప్పులు తీసుకున్నాం(సిఎజీ). చేసిన గొప్ప గొప్ప ప్రాజెక్ట్‌ల నిర్మాణం, అభివృద్ధి చేశాం. బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తీసుకుని అభివృద్ధి కాదు మిత్తిలు కడుతుంది. డేట్ టూ నుంచి జీడీపీలో మేము అప్పులు తగ్గిస్తే.. మీరు పెంచుకుంటు పోతున్నారు. రాష్ట్రంలో ఈ మాత్రం అప్పులు పెరగడానికి కారణం కేంద్రమే. అప్పులు కట్టడమే కాదు తెలంగాణ అభివృద్ధితో సంపద పెంచడానికి కృషి చేస్తున్నాం. బడ్జెట్‌లో విభజన హామీలను గూర్చి చెప్పనే లేదు. కేంద్రం తెలంగాణపై చేసేది డొల్ల ప్రచారం. కేంద్రం 48.7 శాతం మిత్తిలు కట్టేందుకు ఖర్చు పెడితే, తెలంగాణ సంపద పెంచేందుకు కృషి చేస్తుంది. గత సంవత్సరం కంటే విద్యకు నిధులను పెంచాం, కేంద్రం రూ.12 లక్షల కోట్లు బడా బడా కంపెనీల అప్పులను మాఫీ చేసింది. మరి రైతులకు ఎందుకు చేయరు? ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా పొరపాటు లేదు. నూటికి నూరు శాతం నిజం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. అది జరగలేదు కానీ పెట్టుబడి పెరిగింది. కేంద్రం రైతు పక్షపాతి అంటారు. మరి మేము కల్లాలు నిర్మిస్తే నిధులను తిరిగి ఇవ్వాలని ఎందుకు అన్నారో చెప్పాలి. ఆయుష్మాన్ భారత్ కింద దేశ వ్యాప్తంగా 25 లక్షల మందికి మాత్రమే లబ్ది జరుగుతుంది, కానీ ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రంలో 5.90 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. మేము అడిగేది ప్రభుత్వ మెడికల్ కళాశాల, మీరు ఇవ్వమని మొండి చేయి చూపిస్తే.. తెలంగాణ నిధులతో వరంగల్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తాం. ఇక మీకు ఎందుకు ఓటు వేయాలో కరీంనగర్, వరంగల్ ప్రజలు తేల్చుకుంటారు. కేంద్ర బడ్జెట్‌లో పేదలకు కోతలు తప్పు మరేమీ లేదు.’’ అని విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్ రావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
అనుష్క బర్త్ డే పార్టీ.. సందడి చేసిన ఆర్సీబీ ప్లేయర్లు.. ఫొటోస్
అనుష్క బర్త్ డే పార్టీ.. సందడి చేసిన ఆర్సీబీ ప్లేయర్లు.. ఫొటోస్
ప్లాన్‌ చేయమని కల్కికి హింట్‌ ఇచ్చిన దీపిక పదుకోన్‌
ప్లాన్‌ చేయమని కల్కికి హింట్‌ ఇచ్చిన దీపిక పదుకోన్‌
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
షూటింగ్ చూద్దామని వెళ్తే చిరంజీవిగారు నాతో ఆ పని చేయించారు..
షూటింగ్ చూద్దామని వెళ్తే చిరంజీవిగారు నాతో ఆ పని చేయించారు..
గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ఈ టిప్స్ పాటించారంటే.. తెల్లదుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి..
ఈ టిప్స్ పాటించారంటే.. తెల్లదుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి..
మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
'ఏంటీ దారుణం! వీళ్లను మనుషుల్లా ఇంకెప్పటికి చూస్తారు..?' వీడియో
'ఏంటీ దారుణం! వీళ్లను మనుషుల్లా ఇంకెప్పటికి చూస్తారు..?' వీడియో
సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక హరర్ మూవీ..ఎక్కడ చూడొచ్చంటే?
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక హరర్ మూవీ..ఎక్కడ చూడొచ్చంటే?
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..