AP Weather: పండుగ వేళ శ్రీకాకుళంలో అకాల వర్షం.. జిల్లావ్యాప్తంగా కమ్మిన మబ్బులు..

శ్రీకాకుళంలో అకాల వర్షం దంచికొట్టింది. పండుగ రోజు వానతో గుడిలోని క్యూలైన్లలో నిలబడిన భక్తులు ఇబ్బంది పడ్డారు.

AP Weather: పండుగ వేళ శ్రీకాకుళంలో అకాల వర్షం.. జిల్లావ్యాప్తంగా కమ్మిన మబ్బులు..
Srikakulam Rain
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 18, 2023 | 1:16 PM

శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జిల్లా వ్యాపంగా మబ్బులు అలుముకున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తారు వర్షం పడింది. ఆ తరువాత కూడా అక్కడక్కడ చిరు జల్లులు పడుతున్నాయి. వర్షానికి శివరాత్రి సందర్బంగా ఆలయాల క్యూలైన్లలోని భక్తలు ఇబ్బందులు పడ్డారు. ఇది చలికాలం.. ఇప్పుడే ఎండలు ముదురుతున్నాయి. ఎండాకాలం చేరువలో ఉంది. ఈ సీజన్‌లో అకాల వర్షం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరో వైపు అకాల వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కొన్ని చోట్ల మినుములు,పెసలు, ఉలవలు వంటి పంటలు కోతలు పూర్తయ్యి పొలాల్లో ఎండుతున్నాయి.

ఇకపోతే  రాబోయే సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని  ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్ నినో, లా నినో ఎఫెక్ట్‌తో ఈ ఎండాకాలంలో 45 నుంచి 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వడగాల్పలు భారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాలుష్య పెరుగదలే..  పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పెరగడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..