Vamsi – Nani: చంద్రబాబుకు వంశీ, నాని ఓపెన్ ఛాలెంజ్..

మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు వంశీ, నాని. మా నియోజక వర్గాలను టచ్ చేసే దమ్ముందా? అంటూ సవాల్ విసిరారు.

Vamsi - Nani: చంద్రబాబుకు వంశీ, నాని ఓపెన్ ఛాలెంజ్..
Kodali Nani - Vamsi Vallabhaneni
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 18, 2023 | 9:54 AM

ఏపీ రాజకీయం రోజు రోజుకు హీటెక్కుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ నేతలు మాటలు రాటుదేలుతున్నాయి. మిత్రులు, మిత్రులు ఒక్కటై.. ప్రత్యర్థులకు కౌంటర్లు విసురుతున్నారు. గన్నవరం, గుడివాడ మావి. మా నియోజక వర్గాలను టచ్ చేసే దమ్ముందా? మా సంగతి అటుంచి ముందు మీ గురించి చూసుకోండి, మీ స్థానాల్లో మీరు గెలవగలరా? లేదంటే మాపై పోటీకి దిగే దమ్ముందా అంటూ చంద్రబాబు, లోకేష్‌కు చాలెంజ్‌ విసిరారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

అసలు ముందు కుప్పంలో చంద్రబాబు గెలవగలరా? ఆయన నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. ముందు ఆయన సీటు పదిలం చేసుకోవాలంటూ సూచించారు వల్లభనేని వంశీ. అటు గన్నవరం, గుడివాడ.. ఈ రెండు నియోజక వర్గాలు కొడాలి నాని, నావే అంటూ కుండబద్ధలు కొడతున్నారు వంశీ.

కొడాలి నాని సైతం ఇదే చాలెంజ్ చేశారు. వంశీని టచ్‌ చేస్తావా? నన్ను టచ్ చేస్తావా? ద్వారంపూడి చంద్రశేఖర్‌ను టచ్ చేస్తావా? లేదంటే అంబటి రాంబాబును టచ్ చేస్తావా అంటూ సవాల్ విసిరారు కొడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..