Andhra Pradesh: ఏపీలో పెను విషాదం.. వేర్వేరు చోట్ల ఈతకు వెళ్లి ఏడుగురు మృతి..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు ఇవాళ పెను విషాదమైన రోజుగా పేర్కొనాలి. వేర్వేరు చోట్ల ఈతకు వెళ్లి 11 మంది మృత్యువాత పడ్డారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు ఇవాళ పెను విషాదమైన రోజుగా పేర్కొనాలి. వేర్వేరు చోట్ల ఈతకు వెళ్లి 11 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో అందరూ చిన్నారులు, యువకులే ఉన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం అక్కచెరువుపాలెంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు చిన్నారులు కూడా నీటిలో మునిగిపోతుండగా.. స్థానికులు కాపాడారు. వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. చనిపోయిన వారు కౌశిక్ (17), శివాజీ (13), సుబ్రహ్మణ్యం (15), బబ్లు (9) గా గుర్తించారు పోలీసులు.
ఇక శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్‌జీఆర్ పురం సముద్ర తీరంలో ముగ్గురు గల్లంతయ్యారు. సముద్రంలో స్నానానికి వెళ్లిని ముగ్గురు వ్యక్తులు గణేష్(32), దీవెన(18), మానస(9) గల్లంతయ్యారు. గల్లంతైన వీరు విశాఖ జిల్లాలోని భీమునిపట్నం మండలం నగరప్పాలెం వాసులుగా గుర్తించారు పోలీసులు.