AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఆ గ్రామం నుంచి ‘జగనన్నకు చెబుదాం’కు వరస ఫోన్ కాల్స్.. పరుగులు తీసిన అధికారులు.. చివరకు

దోమలు, మురుగు కాల్వలు రోడ్లు సమస్య ఇలా సామాజిక సమస్యలపై ఊరంతా పోరాడి హక్కులు సాధించుకుంటారు. కాని ఏలూరులోని ఆ గ్రామస్తులు మాత్రం కోతులు బాబోయ్ కోతులని హడలి పోతున్నారు . ఏకంగా జగనన్నకు చెబుతాం కు కాల్ చేసి తమను కాపాడాలని కోరుకున్నారు. ఏలూరు జిల్లాలో కోతుల పేరు వింటేనే ఆ ఊరు భయపడుతుంది. ఎపుడు ఎటువైపు నుంచి..

AP News: ఆ గ్రామం నుంచి 'జగనన్నకు చెబుదాం'కు వరస ఫోన్ కాల్స్.. పరుగులు తీసిన అధికారులు.. చివరకు
Jaganannaku Chebudam
B Ravi Kumar
| Edited By: |

Updated on: Aug 27, 2023 | 12:49 PM

Share

ఏలూరు, ఆగస్టు 27: దోమలు, మురుగు కాల్వలు రోడ్లు సమస్య ఇలా సామాజిక సమస్యలపై ఊరంతా పోరాడి హక్కులు సాధించుకుంటారు. కాని ఏలూరులోని ఆ గ్రామస్తులు మాత్రం కోతులు బాబోయ్ కోతులని హడలి పోతున్నారు . ఏకంగా జగనన్నకు చెబుతాం కు కాల్ చేసి తమను కాపాడాలని కోరుకున్నారు. ఏలూరు జిల్లాలో కోతుల పేరు వింటేనే ఆ ఊరు భయపడుతుంది. ఎపుడు ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తాయో అని బిక్కుబిక్కున వాళ్లు బ్రతుకుతున్నారు ఆ ఊరు గ్రామస్తులు. ఏ వస్తువైనా తమ ఇంటి ముందు ఆరపెడితే వాటిని అర క్షణంలో నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇంటి నుంచి పిల్లలను సైతం పెద్దలు బయటకు రానివ్వడం లేదు. అవసరం ఉంటేనే తప్ప పెద్దలు కూడా బయటికి వచ్చే సాహసం చేయడం లేదు. దీంతో వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని గ్రామస్తులు ఆలోచించారు. సమస్య తీవ్రత అధికారులకు అర్థమయ్యే విధంగా గ్రామస్తులంతా ఒకే సమస్యపై ఫిర్యాదు చేయడంతో అధికారులు సైతం ఆ గ్రామానికి హుటాహుటిన పరుగులెత్తారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో వందల సంఖ్యలో కోతులు సంచరిస్తుంటాయి. అయితే ఆహార కొరత మరియు ఇతర కారణాల చేత అవి సమీపంలో ఉన్న జి కొత్తపల్లి గ్రామంలోకి వెలుతున్నాయి. అయితే గ్రామంలోకి వెళ్లిన క్రమంలో వాటి కంటబడిన చిన్న పిల్లలు, పెద్దలపై వారేమన్నా చేస్తారనే భయంతో వారిని గాయపరుస్తున్నాయి.

అంతేకాక వాటి కంటపడిన ప్రతి వస్తువులను, ఆరబెట్టిన పదార్థాలను సైతం నాశనం చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. గత కొన్ని రోజులుగా కోతుల దాడులు మరీ ఎక్కువయ్యాయి. సమస్యను అలాగే విడిచి పెడితే మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు భావించారు. ఈ క్రమంలోనే వారంతా ఏకమై ప్రభుత్వ సహకారంతో సమస్య పరిష్కారానికి ఆలోచన చేశారు. అందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం ఆన్లైన్ పోన్ నెంబర్ ద్వారా తమ గ్రామంలో కోతుల సంచారం, దాడులపై అధికారులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల్లో సుమారు 18 మంది ఆన్లైన్ ఫోన్ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయడంతో అధికారులు గ్రామానికి పరుగులెత్తారు. ద్వారకాతిరుమల ఎంపీడీవో సుబ్బరాయన్ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటుచేసి కోతుల వలన జరిగిన దాడులను, వారికి కలిగిన ఇబ్బందులను తెలుసుకున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అధికారులు స్పందించి పరిష్కారం చూపిస్తాననడంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రైళ్లల్లో మిడిల్ బెర్త్ ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేశాఖ నిబంధనలు
రైళ్లల్లో మిడిల్ బెర్త్ ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేశాఖ నిబంధనలు
ఆ హీరోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్! ఏం జరిగిందంటే?
ఆ హీరోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్! ఏం జరిగిందంటే?
పొరపాటున కూడా ఈ8 విషయాలు ఎవ్వరికీ చెప్పకండి..ఆనందం ఆవిరై పోతుంది!
పొరపాటున కూడా ఈ8 విషయాలు ఎవ్వరికీ చెప్పకండి..ఆనందం ఆవిరై పోతుంది!
ఆ భక్తుడి ఒళ్లంతా బంగారమే.. తిరుమలలో గోల్డ్‌మ్యాన్ సందడి..
ఆ భక్తుడి ఒళ్లంతా బంగారమే.. తిరుమలలో గోల్డ్‌మ్యాన్ సందడి..
విజయవాడ టూ హైదరాబాద్.. ప్రయాణం మరింత వేగం..
విజయవాడ టూ హైదరాబాద్.. ప్రయాణం మరింత వేగం..
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి వద్దంటే డబ్బు..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి వద్దంటే డబ్బు..!
గరుడ పురాణం చెబుతున్న పెళ్లి ఆలస్యం రహస్యాలు.. మీరు ఎప్పటికీ..
గరుడ పురాణం చెబుతున్న పెళ్లి ఆలస్యం రహస్యాలు.. మీరు ఎప్పటికీ..
అవసరం లేకపోయినా కొంటున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందంటే!
అవసరం లేకపోయినా కొంటున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందంటే!
ఆ రాశులకు దిగ్బల యోగం.. ఇక వారికి తిరుగే ఉండదు..!
ఆ రాశులకు దిగ్బల యోగం.. ఇక వారికి తిరుగే ఉండదు..!
నోటి ఆరోగ్యంపై అవగాహన కోసం సెన్సోడైన్, TV9 ప్రత్యేక కార్యక్రమం..
నోటి ఆరోగ్యంపై అవగాహన కోసం సెన్సోడైన్, TV9 ప్రత్యేక కార్యక్రమం..