CM Jagan: ఆ 18 మందితో వన్ టూ వన్ మాట్లాడుతున్న జగన్.. ఇప్పటివరకు తాడేపల్లికి వచ్చింది ఎవరంటే..?

ఆ 18 మంది స్థానంలో సీఎం జగన్ కొత్తవారిని వెతుకుతున్నారా? వన్ టు వన్ మీటింగ్ లలో ఏం చెబుతున్నారు? అభ్యర్థి మార్పు తప్పదన్న స్పష్టత ఇచ్చేస్తున్నారా? సిట్టింగ్‌లకు ప్రత్యామ్నాయం చూస్తున్నారా? ఆ 18మందేనా? మార్చే ఎమ్మెల్యేల సంఖ్య అంతకంటే ఎక్కువేనా?

CM Jagan: ఆ 18 మందితో వన్ టూ వన్ మాట్లాడుతున్న జగన్.. ఇప్పటివరకు తాడేపల్లికి వచ్చింది ఎవరంటే..?
Cm Jagan With YSRCP MLAs
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 30, 2023 | 5:53 PM

వై నాట్ 175 అంటున్న వైసీపీ అధినేత జగన్…అందుకు తగ్గట్టే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఈమధ్య సమావేశమైన జగన్‌ పర్‌ఫామెన్స్‌ సరిగా లేనివారు ఇంటికేనని మొహమాటం లేకుండా చెప్పేశారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని అందరిముందే చెప్పారు. వారితో పర్సనల్‌గా మాట్లాడతానని కూడా చెప్పారు సీఎం జగన్మోహన్‌రెడ్డి. అన్నట్లుగానే ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్, తెల్లం బాలరాజు, జ్యోతుల చంటిబాబు, కిలారి రోశయ్య, సామినేని ఉదయభానులతో జగన్‌ వన్‌ టూ వన్‌ మాట్లాడారు. 18మంది జాబితాలో ఒకరిద్దరు మంత్రులు, మాజీలు కూడా ఉండటంతో వారిని కూడా పిలిచి మాట్లాడనున్నారు వైసీపీ బాస్.

ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ వీక్‌గా ఉన్నారు.. ఎందుకు అనుకున్నస్థాయిలో ప్రజల మద్దతు పొందలేకపోతున్నారన్నదానిపై ప్రధానంగా ఆరాతీస్తున్నారట వైసీపీ అధినేత. అయితే ఎంత కౌన్సెలింగ్‌ చేసినా అందులో ఒకరిద్దరికి మినహా మిగిలిన వారికి సీట్లు ఇవ్వడం కష్టమన్న నిర్ణయానికి వచ్చారట జగన్. అంతే కాదు వీరి స్థానంలో ప్రత్యామ్నాయ అభ్యర్థులను కూడా సిద్ధం చేసే పనిలో ఉందట వైసీపీ అధినాయకత్వం. అయితే ముందుగానే సీటు లేదు అని చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారట అధినేత. మరోవైపు ఆలస్యం చేయడం కంటే కనీసం ఆర్నెల్ల ముందు కొత్త అభ్యర్థులను ప్రకటించడం వల్ల వారికి నియోజకవర్గంలో తిరగడానికి తగిన సమయం ఉంటుందనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు.

పర్‌ఫామెన్స్ బాలేదనుకున్న ఎమ్మెల్యేలకు మొదట కొంత సమయం ఇద్దామనుకున్నారట వైసీపీ అధినేత. అక్టోబర్ వరకూ అవకాశం ఇవ్వాలని అనుకున్నా ఇంకా ముందుగానే ఆయా అభ్యర్థులకు సీటు విషయంలో క్లారిటీ ఇస్తేనే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారట. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 18మంది కాదు.. దాదాపు25 మంది స్థానాలు మార్చాలన్న ఆలోచనతో సీఎం ఉన్నారన్న ప్రచారం సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. కొంతమంది నియోజకవర్గాలు మార్చటంతో పాటు.. మరికొందరిని ఎంపీలుగా నిలబెట్టే ఆలోచనలో కూడా వైసీపీ అధినేత ఉన్నారట. మొత్తంగా సీట్లు, అభ్యర్థుల విషయంలో ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనుకున్న టార్గెట్‌ కొట్టాలనుకుంటున్నారట వైసీపీ అధినేత. ఆయన టార్గెట్టేమోగానీ పరీక్షలకు ప్రిపేరవుతున్న పిల్లల్లాగే ఉందట కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..