AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur: ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఎవరైనా ఇంత పని చేస్తారా..? వామ్మో..

ఒక నెల అద్దె ఆలస్యమైనా ఇంటి ఓనర్ని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి. అద్దె కట్టలేకపోతే అదే ఇంట్లో ఉండటం అసంభవం. కానీ అనంతపురం గుత్తిలో అద్దె ఎగ్గొట్టేందుకు దంపతులు చేసిన పని మాత్రం కిరాతకాన్ని మించిపోయింది. పదివేల అప్పు… నెలలుగా బకాయి అద్దె… ఒత్తిడి పెంచిన ఇంటి యజమానిని ఈ లోకం నుంచి పంపించివేశారు దంపతులు.

Anantapur: ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఎవరైనా ఇంత పని చేస్తారా..? వామ్మో..
Salamma Ramu
Nalluri Naresh
| Edited By: |

Updated on: Dec 07, 2025 | 6:59 AM

Share

మనం ఎవరింట్లో అయినా అద్దెకు ఉంటున్నామంటే.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మసులుకుంటాం.. ఎందుకంటే ఒక నెల అద్దె ఆలస్యమైనా…. ఇబ్బంది వచ్చి ఒక నెల ఇంటి అద్దె కట్టలేకపోయినా ఇంటి ఓనర్ని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి. కానీ అద్దె డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టి అదే ఇంట్లో అద్దెకు ఉండడం సాధ్యమవుతుందా.. కుదరదు కదా. అందుకే అద్దె డబ్బులు ఎగ్గొట్టేందుకు…. ఏకంగా ఇంటి ఓనర్నే లేపేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు ఆ ఇంట్లో రెంట్‌కు ఉంటున్న దంపతులు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రాము, సాలమ్మ దంపతులు.. విజయలక్ష్మి అనే ఒంటరి మహిళ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇంటి ఓనర్ విజయలక్ష్మి దగ్గర అద్దెకు ఉంటున్న దంపతులు పదివేల రూపాయలు అప్పు తీసుకున్నారు. అదేవిధంగా కొన్ని నెలలుగా అడ్డ కూడా చెల్లించడం లేదు. దీంతో ఇంటి ఓనర్ విజయలక్ష్మి…. అద్దెతో పాటు తన వద్ద అప్పుగా తీసుకున్న నగదు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తుంది.

దీంతో అద్దెకు ఉంటున్న రాము, సాలమ్మ దంపతులు… ఎలాగైనా ఇంటి అద్దె ఎగ్గొట్టేందుకు…. ఇంటి ఓనర్ విజయలక్ష్మిని హత్య చేయాలని నిర్ణయించుతున్నారు.  నవంబర్ 26వ తేదీన రాత్రి ఇంటి ఓనర్ విజయలక్ష్మిని…. అద్దెకు ఉంటున్న రాము, సాలమ్మ దంపతులు…. ఇంట్లోనే గొంతు నులిమి అతి కిరాతకంగా చంపారు. అనంతరం విజయలక్ష్మి డెడ్ బాడీని గుంతకల్ మండలం వైటీ చెరువులో పడేశారు. పక్క ఇంట్లోనే ఉంటున్న నివాసముంటున్న విజయలక్ష్మి కుమారుడు తల్లి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు…. ఇంట్లో అద్దెకు ఉంటున్న రాము, సాలమ్మ దంపతులను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో.. హత్య విషయం బయటపడింది..  ఇంటి అద్దె చెల్లించలేక.. అలాగే బదులుగా తీసుకున్న పదివేల రూపాయలు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడంతో… ఇంటి ఓనర్ విజయలక్ష్మిని హత్య చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. ఇంటి ఓనర్ విజయలక్ష్మిని హత్య చేసి మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు తీసుకుని చెరువులో పడేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఇంటి అద్దె ఎగ్గొట్టేందుకు… ఏకంగా ఇంటి ఓనర్నే హత్య చేసిన రాము, సాలమ్మ దంపతులను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.   

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్