పెట్రోల్ బంకులో ఘరానా మోసం.. మీటర్ ట్యాంపరింగ్‌తో రూ.కోట్లు కొల్లగొట్టారు..! కట్ చేస్తే..
శ్రీ విజయలక్ష్మి ఆటో కేర్ అండ్ ఫ్యూయల్ స్టేషన్ అనే పెట్రోల్ బంకులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ పంపులను తనిఖీ చేయగా... డీజిల్ పంప్ ఉన్న డిజిటల్ మీటర్ కు చిప్ అమర్చి ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఏడాది క్రితం డీజిల్ పంపుకు హైదరాబాదు నుంచి ఓ టెక్నీషియన్ ను తీసుకొచ్చి చిప్ అమర్చినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

పెట్రోల్ బంకుల్లో అనేక రకాల మోసాలు మనం చూసాం… కానీ అనంతపురం జిల్లాలో జరిగిన ఈ మోసం రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు అంటున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు… విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో పెట్రోల్ బంకులు కొత్త రకం మోసం బయటపడింది. ఎలక్ట్రికల్ చిప్ అమర్చి రీడింగ్ ను టాంపర్ చేస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యాలు… వాహనదారులను నిలువున మోసం చేస్తున్నాయి. ఆఖరికి లీగల్ మెట్రాలాజీ అధికారులకు కూడా తెలియకుండా మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్ ల గుట్టును విజిలెన్స్ అధికారులు బట్ట బయలు చేశారు.
పక్కా సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనంతపురం శివారు ప్రాంతమైన సోమలదొడ్డిలోని శ్రీ విజయలక్ష్మి ఆటో కేర్ అండ్ ఫ్యూయల్ స్టేషన్ అనే పెట్రోల్ బంకులో తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ పంపులను తనిఖీ చేయగా… డీజిల్ పంప్ ఉన్న డిజిటల్ మీటర్ కు చిప్ అమర్చి ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఏడాది క్రితం డీజిల్ పంపుకు హైదరాబాదు నుంచి ఓ టెక్నీషియన్ ను తీసుకొచ్చి చిప్ అమర్చినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
ఒక్క సంవత్సరంలో రెండు లక్షల పై చిలుకు లీటర్ల డీజిల్ ని మిగుల్చుకున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం… వాహనదారుల నుంచి దాదాపు రెండు కోట్ల పైచిలుకు డబ్బు అక్రమంగా సంపాదించినట్లు తెలుసుకున్న విజిలెన్స్ అధికారులే కంగుతున్నారు. దీంతో విజయలక్ష్మి ఆటో కేర్ ఫ్యూయల్ స్టేషన్ పెట్రోల్ బంకులో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో చిప్ బాగోతం బయటపడింది. ఒక సంవత్సరంలోనే సుమారు ఒక పంపు ద్వారా రెండు కోట్ల పైచిలుకు రూపాయిలు మోసం చేసినట్లు విజిలెన్స్ తనిఖీల్లో అధికారులు గుర్తించారు.
ఇలాంటి చిప్ లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్ లు జిల్లాల్లో ఇంకా ఉన్నట్లు… అన్ని పెట్రోల్ బంకులను తనిఖీ చేస్తాం అంటున్నారు విజిలెన్స్ డిఎస్పి నాగభూషణం…. ఈ తరహా ఎలక్ట్రికల్ చీప్ అమర్చి పెట్రోల్ బంకుల్లో డీజిల్ మోసం చేయడం ఇదే మొదటిసారి అంటున్నారు విజిలెన్స్ అధికారులు. గతంలో తూనికలు కొలతలకు సంబంధించిన అధికారులు సీల్ను తొలగించి అనేక మోసాలకు పాల్ప పెట్రోల్ బంక్ యజమానులు… ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ చిప్ అమర్చి మోసాలకు పాల్పడటం అధికారులను విస్మయానికి గురిచేస్తుంది.
ఇది కూడా చదవండి: వార్నీ వీడెవడండీ బాబు.. పిల్లకు బదులు రైస్ కుక్కర్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత.!
ఇది కూడా చదవండి: తొక్కే కదా అని తీసి పారేయొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు..!
ఇది కూడా చదవండి: పెళ్లి ఊరేగింపులో దారుణం..! గుర్రంపై ఊరేగుతూ కుప్పకూలిన వరుడు.. షాకింగ్ వీడియో వైరల్..
ఇది కూడా చదవండి: వీళ్ల రీల్స్ పిచ్చి తగలేయా.. బర్త్‌డేను కాస్త డెత్ డేగా మార్చేట్టున్నారుగా.. కేక్ పేలటంతో..
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..
ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?
ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్ చేసేయండిలా..
ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




