Ambati Rambabu: ‘మెటీరియల్ బాగాలేనప్పుడు మేస్త్రీ ఏం చేస్తారు’: మంత్రి అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రసవత్తరంగా సాగుతున్నాయి. మన్నటి వరకూ ఉత్తరాంధ్ర వేదికగా సాగిన రాజకీయం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఒకవైపు సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమఘ్నమై ఉంటే.. టీడీపీ అధినేత రాజకీయ వ్యూహకర్తలతో మాటమంతి నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Ambati Rambabu: 'మెటీరియల్ బాగాలేనప్పుడు మేస్త్రీ ఏం చేస్తారు': మంత్రి అంబటి రాంబాబు
Ambati Rambabu
Follow us

|

Updated on: Dec 23, 2023 | 6:57 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రసవత్తరంగా సాగుతున్నాయి. మన్నటి వరకూ ఉత్తరాంధ్ర వేదికగా సాగిన రాజకీయం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఒకవైపు సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమఘ్నమై ఉంటే.. టీడీపీ అధినేత రాజకీయ వ్యూహకర్తలతో మాటమంతి నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ కి చెందిన ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహ కర్త అని అతనిని నారా లోకేష్ కలవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈయన దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకు పనిచేశారు.. గత ఎన్నికల్లో వైసీపీకి కూడా రాజకీయ వ్యూహకర్తగా సలహాలు సూచనలు ఇచ్చారన్నారు.

గతంలో వైసీపీ ప్రశాంత్ కిశోర్‎ను రాజకీయ వ్యూహకర్తగా ఎంపిక చేసుకుంటే నారా లోకేష్ ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. బీహార్ డెకాయిట్ వచ్చారన్నారు.. వాళ్ల తోకలు కత్తిరిస్తామన్న మాటలు గుర్తు చేశారు. మతకల్లలాలు సృష్టించామని లోకేష్ దిగజారుడుగా మాట్లాడినట్లు తెలిపారు. మెటీరియల్ బాగాలేనప్పుడు మేస్త్రీ ఏం చేస్తారని చురకలు అంటించారు. ఆ పీకే, ఈ పీకే ఏమీ చేయలేరని చెప్పారు. టీడీపీ చనిపోయిన పార్టీ అని ప్రశాంత్ కిషోర్ శవ పరీక్షకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఏం చేసినా టీడీపీని బ్రతికించలేరని జోస్యం చెప్పారు. రాబిన్ సింగ్ పని అయిపోయింది కనుకనే పీకేని పిలిపించుకున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పీవీఆర్‌ ఐనాక్స్‌, ఖుషీ అడ్వర్టైజింగ్‌తో కీలక ఒప్పందం..
పీవీఆర్‌ ఐనాక్స్‌, ఖుషీ అడ్వర్టైజింగ్‌తో కీలక ఒప్పందం..
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు..
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు..
దసరాకు ముందు పేదలకు గుడ్‌న్యూస్.. కేంద్రం మరో కీలక ప్రకటన
దసరాకు ముందు పేదలకు గుడ్‌న్యూస్.. కేంద్రం మరో కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌పై ‘మీర్జాపూర్‌’ నటుడు పంకజ్‌ త్రిపాఠి ప్రశంసలు..
పవన్‌ కల్యాణ్‌పై ‘మీర్జాపూర్‌’ నటుడు పంకజ్‌ త్రిపాఠి ప్రశంసలు..
బీపీని కంట్రోల్ చేసే బెస్ట్ డ్రింక్స్ ఇవే.. డోంట్ మిస్!
బీపీని కంట్రోల్ చేసే బెస్ట్ డ్రింక్స్ ఇవే.. డోంట్ మిస్!
రిచ్ లుక్‌లో మేడ్ ఇండియా ఈ-స్కూటర్.. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ
రిచ్ లుక్‌లో మేడ్ ఇండియా ఈ-స్కూటర్.. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ
బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పులు లేకుండా కిచ్చా సుదీప్..
బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పులు లేకుండా కిచ్చా సుదీప్..
జీవితంలో ఒక మనిషిని ఇలా ఎవరైనా ప్రేమించగలరా..? సాయి పల్లవి
జీవితంలో ఒక మనిషిని ఇలా ఎవరైనా ప్రేమించగలరా..? సాయి పల్లవి
రెండోసారి తండ్రి కాబోతోన్న రోహిత్ శర్మ.. కివీస్ సిరీస్ నుంచి ఔట్?
రెండోసారి తండ్రి కాబోతోన్న రోహిత్ శర్మ.. కివీస్ సిరీస్ నుంచి ఔట్?
కీళ్ల నొప్పులను పెంచే ఫుడ్స్ ఇవే.. వీటి జోలికి పోకండి..
కీళ్ల నొప్పులను పెంచే ఫుడ్స్ ఇవే.. వీటి జోలికి పోకండి..