Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: విశాఖ చరిత్రలో డిసెంబరు 23 తేదీకి ప్రత్యేక స్థానం.. 120 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..?

విశాఖపట్నం వాసులకు డిసెంబర్ 23 అంటే చాలా ప్రత్యేకమైన రోజు. 120 ఏళ్ల క్రితం.. అంటే 1901 డిసెంబరు 23న  అప్పుడప్పుడే విస్తరిస్తున్న విశాఖలో మొదటిసారిగా పైపుల వ్యవస్థ ద్వారా రక్షిత మంచి నీటి సరఫరా జరిగింది. అంతకు ముందు విశాఖలోని ఆన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు నీటి బావులపైనే ఆధారపడేవారు. జనాభా పెరగడం, పట్టణం విస్తరిస్తుండడంతో..

Visakhapatnam: విశాఖ చరిత్రలో డిసెంబరు 23 తేదీకి ప్రత్యేక స్థానం.. 120 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..?
Visakhapatnam Tap Water
Follow us
Eswar Chennupalli

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 23, 2023 | 6:17 PM

విశాఖపట్నం వాసులకు డిసెంబర్ 23 అంటే చాలా ప్రత్యేకమైన రోజు. 120 ఏళ్ల క్రితం.. అంటే 1901 డిసెంబరు 23న  అప్పుడప్పుడే విస్తరిస్తున్న విశాఖలో మొదటిసారిగా పైపుల వ్యవస్థ ద్వారా రక్షిత మంచి నీటి సరఫరా జరిగింది. అంతకు ముందు విశాఖలోని ఆన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు నీటి బావులపైనే ఆధారపడేవారు. జనాభా పెరగడం, పట్టణం విస్తరిస్తుండడంతో మున్సిపల్ అధికారులు ప్రస్తుతం ఉన్న బావులను మెరుగుపరిచి కొత్త బావులను తవ్వి కొరత తీర్చే వారు. వేసవి తో పాటు వర్షాభావ కాలాల్లో, ప్రస్తుతం అల్లిపురంలోని టర్నర్స్ చౌల్ట్రీ మరియు నేరెళ్లకోనేరు సమీపంలోని డైక్స్ చెరువు ఒడ్డున తాత్కాలిక బావులు త్రవ్వడం తో తర్వాత కాలంలో చాలా బావులు ఎండిపోయి కనిపించేవి.

అప్పట్లో 4.21 లక్షల తో తొలిసారి రక్షిత మంచినీటి సరఫరా ప్రతిపాదన

1880 నుండి రక్షిత నీటిని సరఫరా చేసే పథకాన్ని ఆలోచించడాన్ని అప్పటి పురపాలక శాఖ అధికారులు ప్రారంభించారు. అప్పట్లో హనుమంతవాక వాగు ఒక్కటే నగరానికి సమీపంలో అందుబాటులో ఉన్న ఏకైక శాశ్వత వనరుగా కనిపించేది. ఈ పథకం 1896-97లో రూ. 4.21 లక్షల అంచనాతో మంజూరు చేయబడింది, ఈ మొత్తంలో సగం ప్రభుత్వం నుండి గ్రాంట్‌గా మరికొంత మొత్తం రుణంగా మంజూరు చేశారు. ఆ మెత్తాన్ని మున్సిపాలిటీ 30 సంవత్సరాలలో 4.25% తిరిగి చెల్లించబడేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది.

ముడసర్లోవ వద్ద హనుమంతవాక వాగు కు అడ్డంకిని నిర్మించి సుమారు 25 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటిని నిల్వ చేసేందుకు ఆరు చదరపు మైళ్ల పరివాహక ప్రాంతంతో రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించినట్టు హిస్టరీ బఫ్ మరియు హెరిటేజ్ కన్జర్వేషనిస్ట్ విజ్జేశ్వరపు ఎడ్వర్డ్ పాల్ టీ వీ 9 తో తెలిపారు.

1910, డిసెంబర్ 23 న తొలిసారిగా ట్యాప్ ద్వారా తాగు నీరు

రక్షిత తాగు నీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రజాపనుల శాఖ చేపట్టింది. డిసెంబరు 23, 1901న నగరవాసులు తమ మొదటి రక్షిత నీటి రుచిని పొందారు. అయితే మొత్తం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టింది. చివరకు మే 21, 1903న మున్సిపాలిటీకి నీటి సరఫరా పథకాన్ని అప్పగించారు’’ అని పాల్ వివరించారు.

ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లోని మాజీ షిప్పింగ్ మేనేజర్ ఒకరు టీవీ9 తో మాట్లాడుతూ వాల్తేర్ మరియు దొండపర్తి ప్రాంతాలను మొదట ఈ పథకంలో చేర్చలేదని చెప్పారు. వాల్తేర్ యొక్క ఎత్తు హనుమంత వాగుకు ఎక్కువ ఎత్తులో ఉన్నందున, సర్వీస్ రిజర్వాయర్ నుండి నీటిని పంప్ చేయడానికి ఒక పంపింగ్ స్టేషన్ నిర్మించబడింది. దీని ద్వారానే రక్షిత నీరుమొదటిసారిగా సరఫరా చేయబడింది.

మున్సిపాలిటీ తొలుత పబ్లిక్‌ కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేసింది. వ్యక్తిగత ఇళ్లకు మొదట కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. వాధ్వన్ రాణి 1917లో అల్లిపురం యొక్క ఉత్తర భాగానికి, అలాగే హిందూ శ్మశాన వాటికకు పైప్‌లైన్‌ల విస్తరణకు అవసరమైన నిధులను అందించింది. తరువాత, కింగ్ జార్జ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్, విశాఖ సెంట్రల్ జైలు వంటి సంస్థలకు కుళాయి కనెక్షన్లు అందించబడి నీటి సరఫరా చేయడం జరిగింది

ప్రస్తుతం విశాఖ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ గా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం గా, కోస్మో, మెట్రో పొలిటిన్ సిటీ గా అభివృద్ది చెంది దాదాపు 25 లక్షల మందికి అవసరమైన రక్షిత మంచి నీరు అందిస్తున్న మహా నగరం గా మారింది. కానీ ఈ సుందర నగరం లో 1901 లోనే పైపుల వ్యవస్థ ద్వారా రక్షిత మంచి నీరు అందించారన్న సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.