- Telugu News Photo Gallery Cricket photos Champions Trophy 2025 May Start in February Check All Teams and Groups
Champions Trophy 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 జట్లతో మహా జాతరకు రంగం సిద్ధం… ఎప్పుడంటే?
Champions Trophy 2025: ఎంతో మంది ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించి తొలి రౌండ్‌లో ఆయా గ్రూపుల్లోని జట్ల మధ్య మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
Updated on: Dec 22, 2024 | 11:19 AM

ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్వహించే ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించి టోర్నీ నిర్వహించనున్నారు. దీని ప్రకారం గ్రూప్-ఏలో భారత్, పాక్ జట్లు ఆడడం ఖాయమైంది.

గ్రూప్-ఏ జాబితాలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడనున్నాయని తెలిసింది. ఈ జట్ల మధ్య లీగ్ స్థాయి మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. ఈ జట్లు తొలి దశలో మూడు మ్యాచ్‌లు కూడా ఆడనున్నాయి.

ప్రస్తుత సమాచారం ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. దీనికి సంబంధించి పాక్ క్రికెట్ బోర్డు రూపురేఖలు సిద్ధం చేస్తోందని, త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది.

ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరించినందున, బీసీసీఐ తన మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహించాలని ఐసీసీని అభ్యర్థించింది.

బీసీసీఐ ఈ డిమాండ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించాయి. టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని నిర్ణయించాయి. దీని ప్రకారం టోర్నీ పాకిస్థాన్‌లో జరిగినప్పటికీ భారత్ మ్యాచ్‌లకు యూఏఈ లేదా శ్రీలంక ఆతిథ్యం ఇస్తాయి. అలాగే భారత్, పాకిస్థాన్ జట్లు తటస్థ వేదికపై తలపడనున్నాయి.




