Pushpa 2: వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప-2’ ది రూల్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు ముందే పలు కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
ఈ ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ విడుదల తరువాత సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. విడుదలైన తొలిరోజే నుంచే అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ విషయంలో ఆల్‌టైమ్ రికార్డులు నెలకొల్పుతోంది. పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. వందేళ్ల హిందీ సినీ చరిత్రలో ‘పుష్ప-2’ చిత్రంతో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షల రూపాయాల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2′ దిరూల్ ఆ ఘనతను దక్కించుకుంది. ఇప్పటి వరకు హయ్యెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రంగా ఉన్న’స్త్రీ2’ చిత్రం లైఫ్ టైమ్ రన్‌ను కేవలం 15 రోజుల్లోనే పుష్ప-2 అధిగమించడం విశేషం. దీంతో పాటు అత్యంత వేగంగా 14 రోజుల్లోనే రూ.1500 కోట్ల రూపాయలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా, కేవలం ముంబయ్‌లోనే 200 కోట్ల రూపాయాల నెట్‌ను వసూలు చేసిన తొలిచిత్రంగా పుష్ప-2 రికార్డు క్రియేట్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

