AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. చెక్ చేయగా మెరుస్తూ..

పోలీసులకు గంజాయి రవాణా అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటకుండా కఠిన చర్యలు చేపడుతున్నారు. కానీ కొందరు కేటుగాళ్లు ఇటీవల క్రియేటివిటీని ఉపయోగించి గంజాయిని రాష్ట్రాల సరిహద్దులు దాటిద్దామని అనుకున్నారు. పోలీసులు ఏమైనా తక్కువ.. కాపుకాసి రెడ్ హ్యాండెడ్‌గా స్మగ్లర్లను పట్టుకున్నారు.. ఆ స్టోరీ ఏంటంటే..

AP News: బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. చెక్ చేయగా మెరుస్తూ..
Viral
Ravi Kiran
|

Updated on: Dec 21, 2024 | 7:45 PM

Share

విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలోని బొడ్డవర చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా.. పక్కా సమాచారంతో 117 కిలోల గంజాయిని, బొలేరో వాహనంలో అక్రమ రవాణకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్.కోట పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 19న బొడ్డవర చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా, ఒడిస్సా రాష్ట్రం నుంచి ఇద్దరు వ్యక్తులు కేఎల్ 48జె 5309 బొలేరో వాహనంలో గంజాయిని కేరళ రాష్ట్రంకు తరలిస్తూ పట్టుబడారు.

పట్టుబడిన ఇద్దరు నిందితులను విచారణ చేయగా కేరళ రాష్ట్రంకు చెందిన రామ్ అనే వ్యక్తి ఆదేశాలతో ముందుగా అరకు వచ్చి, అక్కడ వేరే వ్యక్తుల సహకారంతో ఒడిస్సా రాష్ట్రంకు వెళ్ళి, 117 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, ఎవ్వరికీ అనుమానం రాకుండా వాహనం వెనుక భాగంను ఒక అరగా మార్పు చేసి, దానిలో గంజాయిని డంప్ చేసి, కేరళ రాష్ట్రంకు తరలించాలనున్నారు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు.

గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు చెక్ పోస్టులు నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్న కారణంగా ఇటీవల గంజాయి పట్టుకోగలుగుతున్నామని, చెక్ పోస్టుల్లో సిబ్బంది పనితీరు బాగుందన్నారు విజయనగరం డీఎస్పీ. గంజాయి పట్టుకోవడంలో సమర్ధవంతంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

ఇది చదవండి: వాయుగుండం ఉగ్రరూపం.. బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?