AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు.. అందులో మీ రాశి ఉందా?

Rahu Ketu Gochar 2025: వచ్చే ఏడాది(2025) మే 18న రాహు, కేతువులు రాశులు మారడం జరుగుతోంది. రాహువు కుంభ రాశిలో.. కేతువు సింహ రాశిలోనూ ఏడాదిన్నర పాటు సంచారిస్తారు. ఏక కాలంలో రాశులు మారే ఈ రెండు వక్ర గ్రహాలు ఏ రాశివారికీ పూర్తి స్థాయిలో శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉండదు. పైగా, రాహువు శుభ ఫలితాలనిస్తే కేతువు అశుభ ఫలితాలనివ్వడం, కేతువు శుభ ఫలితాలనిస్తే రాహువు అశుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది.

Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు.. అందులో మీ రాశి ఉందా?
Raja Yoga 2025
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 22, 2024 | 10:57 AM

Share

వచ్చే ఏడాది మే 18న రాహు కేతువులు రాశులు మారడం జరుగుతోంది. రాహువు కుంభ రాశిలోనూ, కేతువు సింహ రాశిలోనూ ఏడాదిన్నర పాటు సంచారం సాగిస్తారు. ఏక కాలంలో రాశులు మారే ఈ రెండు వక్ర గ్రహాలు ఏ రాశివారికీ పూర్తి స్థాయిలో శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉండదు. పైగా, రాహువు శుభ ఫలితాలనిస్తే కేతువు అశుభ ఫలితాలనివ్వడం, కేతువు శుభ ఫలితాలనిస్తే రాహువు అశుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. అయితే, ఈసారి మాత్రం ఈ రెండు గ్రహాలు కొన్ని రాశులకు ఉమ్మడిగా శుభ ఫలితాలనివ్వడం జరుగుతోంది. రాహువుకు కుంభ రాశి, కేతువుకు సింహరాశి మిత్ర క్షేత్రాలు కావడం వల్ల ఆ విధంగా జరుగుతోంది. ఈ గ్రహాల రాశుల మార్పువల్ల మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి జీవితంలో ఒక కొత్త సానుకూల అధ్యాయం ప్రారంభమవుతుంది.

  1. మేషం: ఈ రాశికి రాహువు లాభ స్థానంలోకి ప్రవేశించడం వల్ల విశేషమైన ధన లాభం కలుగుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ అవకాశాన్నీఈ రాశివారు జారవిడుచుకోరు. పంచమ స్థానంలో కేతువు ప్రవేశం వల్ల ఏ రంగంలో ఉన్నా వీరి ప్రతిభాపాటవాలు, తెలివితేటలు బాగా రాణిస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధించడం జరుగుతుంది. అందువల్ల దాదాపు ఏడాదంతా వీరికి జయప్రదంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం పెరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాహువు ప్రవేశం వల్ల విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మొత్తం మీద ఈ రాశివారికి విదేశీ సంపాదన లభించే అవకాశం ఉంది. తృతీయ స్థానంలో కేతువు సంచా రం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా ఘన విజయం సాధిస్తారు. సంతాన యోగం కూడా కలిగే అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశిలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఏ రంగంలో ఉన్నా ప్రాభవం, ప్రాధాన్యం బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు పెరుగుతాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. వృత్తి, ఉద్యోగాల కారణంగా విదే శాల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు గడిస్తారు. అనేక మార్గాల్లో తప్పకుండా ఆదాయం పెరుగుతుంది.
  4. తుల: ఈ రాశికి పంచమ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల అనేక రకాలైన నైపుణ్యాలు సిద్ధిస్తాయి. ఉద్యో గంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లాభాలు పొందుతారు. లాభదాయక వ్యవహారాలను చేపడతారు. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. లాభ స్థానంలో కేతువు ప్రవేశం వల్ల ఆకస్మిక దన ప్రాప్తికి, అప్రయత్న ధన లాభానికి బాగా అవ కాశం ఉంటుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల ఏ రంగంలో ఉన్నవారికైనా శీఘ్ర పురోగతి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. కొన్ని సమస్యలు, వివాదాల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. భాగ్య స్థానంలో కేతు సంచారం వల్ల సమాజంలో ఒక ప్రముఖు డుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. తీర్థ యాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా జరుగు తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానకూలంగా నెరవేరుతుంది. వారసత్వ సంపద లభిస్తుంది.
  6. మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల విదేశాల్లో స్థిరపడే అవకాశం లభిస్తుంది. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు లభించడం, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదరడం వంటివి జరుగుతాయి. ఆరవ స్థానంలో కేతువు సంచారం వల్ల ఆదాయం వృద్ధి చెంది, ముఖ్యమైన ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. శత్రు బాధ తగ్గుతుంది.

ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్నా: పూరీ జగన్నాథ్
ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్నా: పూరీ జగన్నాథ్
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో