Weekend Hour: మాజీ జేడీ లేటెస్ట్‌ ఎంట్రీతో.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భంచింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ... జై భారత్‌ నేషనల్‌ పార్టీని స్థాపించడం రాజకీయ సంచలనంగా మారింది. ఇంతకీ ఆయన లేటెస్ట్‌ స్టెప్‌... ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ ఉన్నపార్టీలకు తోడు.. మరో పార్టీకి ప్లేస్‌ ఉందా? ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది.

Weekend Hour: మాజీ జేడీ లేటెస్ట్‌ ఎంట్రీతో.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
Weekend Hour
Follow us

|

Updated on: Dec 23, 2023 | 7:00 PM

పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ లీడర్లకు ఉన్నంత కాకపోయినా.. దాదాపుగా ఆస్థాయి ఫాలోయింగ్‌ కలిగి ఉంటారు సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణ. అందుకే సీబీఐ అధికారిగా ఉన్నప్పటి నుంచి.. నేటి రాజకీయాల దాకా… ఆయనేం చేసినా సంచలనమే అవుతోంది. తాజాగా, జై భారత్‌ నేషనల్‌ పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాల్లో కొత్త అలజడి సృష్టించారు.1965, ఏప్రిల్ 3న కర్నూలు జిల్లా శ్రీశైలంలో జన్మించిన వాసగిరి లక్ష్మీనారాయణ… ఐఐటీలో ఎంటెక్‌ పూర్తిచేసి సివిల్స్‌ వైపు వచ్చారు. మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. నాందేడ్‌ ఎస్పీగా, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ గా పనిచేశారు. ఆ తర్వాత సీబీఐ హైదరాబాద్ జాయింట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన లక్ష్మీనారాయణ… సంచలన కేసుల దర్యాప్తులో.. లైట్‌లైట్‌లోకి వచ్చారు. పొలిటికల్‌ సెలబ్రిటీలతో సమానమైన ఫేమ్‌ను సంపాదించారు.

దేశవ్యాప్తంగా చాలా కేసులు దర్యాప్తు చేసినా… సొంత రాష్ట్రం ఏపీకి చెందిన కేసులే లక్ష్మీనారాయణ పేరును మార్మోగేలా చేశాయి. తొలుత ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు, ఆ తర్వాత అవుటర్‌ రింగ్‌రోడ్డులో భూసేకరణ అక్రమాల కేసు,సత్యం కుంభకోణం కేసు దర్యాప్తులు.. ఆయనకు మంచిపేరు తెచ్చాయి. ఓఎంసీ కేసు,జగన్‌ ఆస్తుల కేసు దర్యాప్తు.. ఆయణ్ని మరింత ఫేమస్‌గా చేశాయి.2017లో విశిష్ట సేవలకు గాను లక్ష్మినారాయణకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ కూడా దక్కింది.

2018 మార్చిలో విధుల నుంచి స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్న లక్ష్మీనారాయణ.. కొన్నాళ్లకు రాజకీయ అరంగేట్రం చేశారు. రాయలసీమలో ప్రజలపక్షాన పాదయాత్ర కూడా చేశారు.అయితే, 2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరి.. విశాఖ ఎంపీ స్థానంలో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటున్న లక్ష్మీనారాయణ.. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.

ఓడినా, గెలిచినా.. ప్రజాక్షేత్రంలో ఉంటానంటూ గతంలోనే ప్రకటించిన లక్ష్మీనారాయణ.. ఇప్పుడు కొత్త పార్టీని ఏర్పాటు చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరి, ఆయన లేటెస్ట్‌ ఎంట్రీ అధికార పక్షానికి మేలు చేస్తుందా? విపక్షం ఆశలపై నీళ్లు చల్లుతుందా? ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…