కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేసిన మంత్రి అనిల్ కుమార్

విజయవాడలోని కృష్ణా డెల్టాకు ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. కృష్ణాడెల్టాకు 150టీఎంసీల నీరు అవసరమని చెప్పారు. పట్టిసీమ నుంచి 80టీఎంసీల నీటిని అందిస్తామని.. సాగర్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా 60టీఎంసీలు అందిస్తామని పేర్కొన్నారు. చిట్టచివరి ఆయకట్టుకు వరకు నీరందిస్తామని చెప్పుకొచ్చారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆలస్యంగా నీళ్లొచ్చాయని.. త్వరలో […]

కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేసిన మంత్రి అనిల్ కుమార్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 12, 2019 | 7:20 PM

విజయవాడలోని కృష్ణా డెల్టాకు ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. కృష్ణాడెల్టాకు 150టీఎంసీల నీరు అవసరమని చెప్పారు. పట్టిసీమ నుంచి 80టీఎంసీల నీటిని అందిస్తామని.. సాగర్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా 60టీఎంసీలు అందిస్తామని పేర్కొన్నారు. చిట్టచివరి ఆయకట్టుకు వరకు నీరందిస్తామని చెప్పుకొచ్చారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆలస్యంగా నీళ్లొచ్చాయని.. త్వరలో పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తామని అనిల్ కుమార్ వెల్లడించారు.