తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం కారణంగా ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ కాస్త ఆలస్యంగా 12 గంటల 20 నిమిషాలకు ప్రవేశపెట్టారు. వైఎస్సార్ రైతు భరోసా, అమ్మఒడి, పథకాలకు నిధులను పెంచుతున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. 9 గంటలకు ఉచిత విద్యుత్‌కు […]

తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 12, 2019 | 5:00 PM

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం కారణంగా ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ కాస్త ఆలస్యంగా 12 గంటల 20 నిమిషాలకు ప్రవేశపెట్టారు. వైఎస్సార్ రైతు భరోసా, అమ్మఒడి, పథకాలకు నిధులను పెంచుతున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. 9 గంటలకు ఉచిత విద్యుత్‌కు రూ. 4వేల కోట్లకు పైగా కేటాయింపులు జరుపుతున్నట్లు బుగ్గన వెల్లడించారు.

ఏ పథకానికి ఎన్ని కోట్లు..

విత్తన సరఫరా కోసం రూ. 200 కోట్లు గిడ్డంగుల కోసం రూ. 200 కోట్లు వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు రూ. 109 కోట్లు రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ. 100 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా రూ. 8750 కోట్లు అమ్మఒడికి రూ. 6455 కోట్లు రూ. 2002 కోట్లతో విపత్తు నిర్వహణ నిధి వైఎస్సార్ పీఎం ఫసల్ బీమాకు రూ. 1163 కోట్లు ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ రూ. 475 కోట్లు బోర్ రిగ్గుల కోసం రూ. 200 కోట్లు ఎస్సీల సంక్షేమానికి రూ.798 కోట్లు వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు గ్రామీణాభివృద్ధికి రూ.329 కోట్లు సాగునీటి రంగానికి రూ. 13,139 కోట్లు విద్యుత్ రంగానికి రూ.6861 కోట్లు పరిశ్రమలకు రూ. 3986 కోట్లు విద్యా రంగానికి రూ.32,618 కోట్లు క్రీడలు, యువజన సర్వీసులు రూ.329 కోట్లు సాంకేతిక విద్య రూ.580 కోట్లు కళలు, సాంస్కృతిక విభాగానికి రూ.77 కోట్లు

వైద్య రంగానికి రూ.11399 కోట్లు మంచి నీరు, మురుగు నీటి నిర్వహణకు రూ.2234 కోట్లు గృహ నిర్మాణానికి రూ.6587 కోట్లు 2018-19 సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం బడ్జెట్ రూ.1,62,134 కోట్లు గత బడ్జెట్ కంటే 19 శాతం పెంపు రెవెన్యూ వ్యయం రూ.1,80,475 కోట్లు రెవెన్యూ లోటు అంచనా రూ.1778 కోట్లు జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 0.17 శాతం ద్రవ్య లోటు అంచనా రూ. 35, 260 కోట్లు జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.30 శాతం మూల ధన వ్యయం రూ. 32,293 కోట్లు చెల్లించాల్సిన అప్పులకు కేటాయింపు రూ.8994 కోట్లు

పట్టణాభివృద్ధి రూ.6597 కోట్లు సమాచారం, ప్రజా సంబంధాలు: రూ.191కోట్లు సంక్షేమ రంగానికి రూ.14,142 కోట్లు కార్మిక, ఉపాధి రంగాలకు రూ.978 కోట్లు సామాజిక భద్రత, సంక్షేమానికి రూ.2707 కోట్లు సాధారణ సేవలు రూ.66,324 కోట్లు రాష్ట్రాభివృద్ధి పథకాలకు రూ.92,050కోట్లు(+87శాతం) ఎస్సీల అభివృద్ధికి రూ.15వేల కోట్లు(+33శాతం) ఎస్టీల అభివృద్ధికి రూ.4988కోట్లు(+19శాతం) వెనుకబడిన తరగతుల అభివృద్ధికి రూ. 15,061కోట్లు(+23శాతం)

ఆరోగ్య శ్రీ కోసం రూ.1740 కోట్లు కాపుల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సహకారం రూ.1150 కోట్లు వైఎస్సార్ బీమా రూ.404కోట్లు సొంత ఆటో కలిగిన డ్రైవర్లకు ఆర్థిక సహకారం రూ.400 కోట్లు వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేనేత కార్మికులకు వైఎస్సార్ ఆర్థిక సహకారం రూ.200 కోట్లు మతపరమైన సంస్థలకు వైఎస్సార్ గ్రాంట్ రూ.234 కోట్లు బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్‌కు రూ.100 కోట్లు న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు రూ.100 కోట్లు సబ్సిడీ బియ్యానికి రూ.3వేల కోట్లు పౌరసరఫరాల కార్పోరేషన్‌కు రూ.384 కోట్లు గ్రామ వాలంటీర్లకు రూ.720 కోట్లు గ్రామ సచివాలయాలకు రూ.700 కోట్లు మున్సిపల్ వార్డ్ వాలంటీర్లకు రూ.280 కోట్లు మున్సిపల్ వార్డ్ సచివాలయాలకు రూ.180 కోట్లు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ.31,564 కోట్లు రెవెన్యూ శాఖకు రూ.9496 కోట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగానికి రూ.145 కోట్లు రోడ్డు, రవాణా, భవనాలకు రూ.6202 కోట్లు మహిళలు, శిశువులు, దివ్యాంగులు, వృద్ధులకు రూ.2689 కోట్లు

రాజధాని అమరావతి కోసం రూ.500 కోట్లు కడప స్టీల్ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?