PM Modi: రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ చెప్పిన డాక్టర్ కథ విన్నారా?

ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ కు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్ సిరీస్ 'పీపుల్ బై WTF'లో భాగంగా మోడీ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన జీవిత అనుభవాలను పంచుకున్నారు.

PM Modi: రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ చెప్పిన డాక్టర్ కథ విన్నారా?
PM Narendra Modi, Nikhil Kamath
Follow us
Basha Shek

|

Updated on: Jan 11, 2025 | 8:05 AM

ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా పాడ్‌కాస్ట్‌లో అడుగుపెట్టారు. జెరోధా అధినేత నిఖిల్ కామత్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రధాని మోదీ.. తన బాల్యం, ఇంట్లో కష్టాలు, రాజకీయాల్లో ఎదురైన సవాళ్లు.. ఇలా అనేక అంశాల గురించి ఓపెన్ గా మాట్లాడారు. అదే సమయంలో ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టాలంటే బాగా డబ్బు ఉండాలా అని నిఖిల్ కామత్ అడిగిన ప్రశ్నకు మోడీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పాలిటిక్స్ లోకి వచ్చేందుకు ఆసక్తి ఉందా అని ఎవరైనా యువతను అడిగితే అందుకు చాలా డబ్బు కావాలంటున్నారని, సాధారణంగా వ్యాపారంలో ఒక స్టార్టప్‌ కంపెనీ పెట్టాలంటే స్నేహితులు, కుటుంబ సభ్యులను డబ్బులు అడుగుతామని.. అదే రాజకీయాల్లో ఎలా నిఖిల్‌ కామత్‌ ప్రధానిని అడిగారు. దీనికి స్పందించిన మోడీ తన చిన్నతనంలో ప్రత్యక్షంగా చూసిన ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

‘ నేను బాలసేనలో పనిచేస్తున్న సమయంలో మా గ్రామంలో ఒక కంటి డాక్టర్‌ ఉండేవాడు. ఆయన తన వద్దకు వచ్చే వారిని ఎంతో ప్రేమగా పలకరించే వాడు. అన్నీ జాగ్రత్తలు చెప్పి వైద్యం చేసే వారు. దీంతో ఆ కంటి డాక్టర్ కు జనాల్లో మంచి గుర్తింపు వచ్చింది. ప్రజలకు ఇంకా మేలు చేసేందుకు ఆయన ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ డాక్టర్ వద్ద డబ్బులు లేకపోవడంతో ఆయనకు తెలిసిన వారందరి వద్ద విరాళాలు సేకరించారు. అలా వచ్చిన డబ్బుతోనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కేవలం రూ.250 మాత్రమే ఖర్చు చేసి ఆ డాక్టర్ ఎన్నికల్లో విజయం సాధించారు’ అని మోడీ గుర్తు చేసుకున్నారు.

ఇక తన రాజకీయ ప్రయాణం గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ, “ప్రారంభ కాలంలో, ప్రజలు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. నేను ఢిల్లీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సెకండ్ టర్మ్ లో నేను గతంలోని కోణంలోంచి ఆలోచించాను. ఇప్పుడు మూడో టర్మ్‌లో నా ఆలోచన మారింది. “నా నైతికత చాలా ఎక్కువ.  దేశం కోసం నా కలలు చాలా పెద్దవి’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.