Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: తొలి పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్న ప్రధాని మోదీ

పొరపాట్లు చేయడం మానవ సహజం. కానీ వాటిని ఒప్పుకోవడానికి కొంతమంది వెనుకా ముందు ఆలోచిస్తుంటారు. పొరపాటును ఒప్పుకోవాలంటే గట్స్‌ వుండాలి. జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసే విచక్షణ వున్న వాళ్లే వివేకవంతులు. ఇదీ పాడ్‌కాస్ట్‌ వేదికగా ప్రధాని మోదీ లేటెస్ట్‌ మన్‌ కీ బాత్‌. పొరపాట్లు చేయకపోవడానికి తానేం దేవుడిని కాదన్నారాయన.

PM Modi: తొలి పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్న ప్రధాని మోదీ
Nikhil Kamath - PM Modi
Ram Naramaneni
|

Updated on: Jan 11, 2025 | 8:25 AM

Share

ఫస్ట్‌టైమ్‌ ఫాడ్‌కాస్ట్‌ ఇంటర్వూ ఇచ్చిన పీఎం నరేంద్ర మోదీ..వికసిత్‌ భారత్‌ లక్ష్యాలు సహా సమకాలీన రాజకీయాలపై దిల్‌ సే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. యంగ్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌, జిరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ పీపుల్స్‌ పేరిట నిర్వహిస్తోన్న పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర అంశాలను చెప్పారు ప్రధాని మోదీ. గుజరాత్‌ సీఎం టు థర్డ్‌ టైమ్‌ పీఎం వరకు తన ప్రస్థానాన్ని పంచుకున్నారు. గతంలో తను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. తాను మనిషినేనని, అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయన్నారు. తానేం దేవుడిని కాదన్నారు. పొరపాట్లు రీపీట్‌ కాకుండా చూసుకోవడమే తన మంత్ర అన్నారు ప్రధాని.

తాజా రాజకీయాలపై కామత్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తాను సోకాల్డ్‌ పొలిటిషయన్‌ను కాదన్నారు ప్రధాని మోదీ. ఎన్నికలప్పుడు మాత్రమే తాను రాజకీయాలు మాట్లాడుతానన్నారు. ఆ తరువాత తన ఫోకస్‌ అంతా గుడ్‌ గవర్నెనెన్స్‌పైనే ఉంటుందన్నారు.దేశమే తన ఫస్ట్‌ ఛాయిసన్నారాయన

యువత రాజకీయాల్లో రావడం మంచి పరిణామం అన్నారు. ఐతే ప్రజాసేవ లక్ష్యంగా ఉండాలే తప్ప స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయోద్దన్నారు ప్రధాని మోదీ. సంకల్పం స్వచ్ఛత వుంటే ఏ విజయాలైనా సాకారం అవుతాయన్నారు. రాజనీతి కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా నెగ్గుకురావాలంటే… కంఫర్ట్‌ జోన్‌లోనే ఉండిపోకూడదు. రిస్క్‌ తీసుకునే మనస్తత్వం ఉండాలని ప్రధాని చెప్పారు. రాజకీయాల్లో  విమర్శలను ఎదుర్కోక తప్పదని.. కానీ నిజానికి కట్టుబడి ఉండటం ముఖ్యమని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..