Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Scam: ఫోన్‌లో మాట్లాడుతూ రూ.1.51 కోట్లు దోచుకున్న నేరగాళ్లు.. ఇంతకీ ఏం జరిగింది?

Digital Scam: ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. అందువల్ల, ఎవరైనా మిమ్మల్ని ఈ విధంగా సంప్రదిస్తే, ఏ కారణం బ్యాంక్ ఖాతా వివరాలు, డబ్బు లావాదేవీలు వంటి వివరాలు చెప్పవద్దు. పోలీసులు, ఆదాయపన్ను అధికారులమంటూ కాల్స్‌ చేసిన స్పందించవద్దు..

Digital Scam: ఫోన్‌లో మాట్లాడుతూ రూ.1.51 కోట్లు దోచుకున్న నేరగాళ్లు.. ఇంతకీ ఏం జరిగింది?
Subhash Goud
|

Updated on: Jan 11, 2025 | 5:57 AM

Share

మోసగాళ్లు సాంకేతికతను తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజలను మోసం చేసి సొమ్ము దోచుకుంటున్నారు. తాజాగా భారత్‌లో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో ముంబైకి చెందిన ఓ వృద్ధురాలు రూ.1.5 కోట్లు పోగొట్టుకుంది. దక్షిణ ముంబైకి చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు. ముంబై అత్యంత ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ బంధువు. తనపై మనీ ఫ్రాడ్ ఫిర్యాదు అందిందని పేర్కొంటూ మోసానికి పాల్పడ్డాడు. యుఎస్ నుండి తన కుమార్తెకు ఆహారం పంపడానికి ఒక వృద్ధ మహిళ కొరియర్ సర్వీస్‌ను ఉపయోగించడంతో స్కామ్ చేశారు. వృద్ధురాలు కొరియర్ చేయడానికి ప్రయత్నించగా, మరుసటి రోజు ఆమెను సంప్రదించిన వ్యక్తి తాను కొరియర్ కంపెనీ నుండి మాట్లాడుతున్నానని చెప్పాడు.

వృద్ధురాలు అక్రమంగా సరుకులు రవాణా చేస్తుందని మోసగాడు భయపెట్టాడు. అలాగే వృద్ధురాలి పేరిట ఉన్న పార్శిల్‌లో వృద్ధురాలి ఆధార్ కార్డు, గడువు ముగిసిన పాస్‌పోర్టు, క్రెడిట్ కార్డు, 2000 అమెరికన్ డాలర్లు, అక్రమ వస్తువులు ఉన్నాయని తెలిపారు. అంతే కాకుండా వృద్ధురాలిపై మరికొన్ని ఆరోపణలు చేశాడు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే సంచలన నిర్ణయం.. 10 వేల రైళ్లు.. ప్రత్యేక పోలీసు బలగాలు, 12 భాషల్లో అనౌన్స్‌మెంట్‌!

ఆ తర్వాత వృద్ధురాలి నుంచి డబ్బులు వసూలు చేయాలనే లక్ష్యంతో మోసగాళ్లు పలు శాఖల ఉన్నతాధికారులను సంప్రదించారు. ఆడియో కాల్‌తో పాటు, ఉన్నతాధికారుల వేషధారణతో వీడియో కాల్ ద్వారా వృద్ధురాలిని సంప్రదించారు. ఆ తర్వాత అరెస్ట్‌ రిపోర్టుతో సహా పలు పత్రాలను బెదిరించారు. దీంతో భయపడిన వృద్ధురాలు వారి సూచనల మేరకు రూ.1.51 కోట్లను మోసగాళ్లకు పంపించింది. ఇలాంటివి దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. మీ బ్యాంకు ఏటీఎం బ్లాక్‌ అయ్యిందనే, లేక కేవైసీ పేరుతో ఇలా రకరకాల సాకులు చెబుతూ జనాలను నిలువునా దోచుకుంటున్నారు.

సైబర్ నేరాల నుండి ఎలా సురక్షితంగా ఉండాలి?

ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. అందువల్ల, ఎవరైనా మిమ్మల్ని ఈ విధంగా సంప్రదిస్తే, ఏ కారణం బ్యాంక్ ఖాతా వివరాలు, డబ్బు లావాదేవీలు వంటి వివరాలు చెప్పవద్దు. పోలీసులు, ఆదాయపన్ను అధికారులమంటూ కాల్స్‌ చేసిన స్పందించవద్దు. ముఖ్యంగా బ్యాంకుల పేరుతో ఎవరు కాల్‌ చేసి వివరాలు అడిగినా ఎట్టి పరిస్థితుల్లో చెప్పవదని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే కేవైసీకి సంబంధించి వివరాలు, ఓటీపీలు అస్సలు చెప్పకండి. లేకుంటే తీవ్రంగా మోసపోయే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి: Kitchen Tips: దోసె పాన్‌కు అతుక్కుంటుందా? ఇలా చేయండి.. సూపర్ టిప్స్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి