ఆ జాతి కుక్కలను ఇళ్లల్లో పెంచవద్దు.. ఎందుకంటే.?

ఆ జాతి కుక్కలను ఇళ్లల్లో పెంచవద్దు.. ఎందుకంటే.?

image

TV9 Telugu

11 January 2025

చాలామందికి ఇళ్లల్లో కుక్కలను పెంచుకోవడం అంటే చాల ఇష్టం. ఇప్పుడు ఎక్కువగా విదేశీ జాతి కుక్కలను పెంచుకొంటున్నారు.

చాలామందికి ఇళ్లల్లో కుక్కలను పెంచుకోవడం అంటే చాల ఇష్టం. ఇప్పుడు ఎక్కువగా విదేశీ జాతి కుక్కలను పెంచుకొంటున్నారు.

వొడాఫోన్‌ ప్రకటనల ద్వారా అత్యంత ప్రాచుర్యం పొందిన విదేశీ జాతి పగ్స్‌ కుక్కలను ఇళ్లల్లో పెంచడం కుదరదు.

వొడాఫోన్‌ ప్రకటనల ద్వారా అత్యంత ప్రాచుర్యం పొందిన విదేశీ జాతి పగ్స్‌ కుక్కలను ఇళ్లల్లో పెంచడం కుదరదు.

నగర వాతావరణంలో ఇమడలేక శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్నాయని పీపుల్స్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

నగర వాతావరణంలో ఇమడలేక శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్నాయని పీపుల్స్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

గతంలో దీని కోసం హైదరాబాద్‎లోని ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌లో పెటా ఇండియా నిరసన కార్యక్రమం కూడా నిర్వహించింది.

భిన్న ముఖ ఆకృతి కలిగిన పగ్‌ శునకాలకు సరైన శ్వాస అందక పోవడంతో వాటి జీవితకాలం కూడా తగ్గిపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయని పెటా ప్రతినిధులు అన్నారు.

చాలా రకాల విదేశీ జాతి కుక్కలకు ఇక్కడి వాతావరణం సరిపడదని వాటిని పెంచడమంటే ఆ శునకాలను ఇబ్బంది పెట్టడమేనని అన్నారు.

మన వాతావరణంలో ఇమడగలిగిన దేశీయ కుక్కలనే పెంచుకోవాలని, దత్తత తీసుకోవాలని విన్నవించారు పెటా ప్రతినిధులు.

ఈ సందర్భంగా పెటా సభ్యులు పగ్స్‌ దుస్తులు ధరించి ఆక్సిజన్‌ సిలిండర్లతో శ్వాస తీసుకుంటూ ఆ జాతి శునకాల ఆరోగ్య పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించారు.