AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జగన్‌ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

రెండవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ పై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. సున్నా వడ్డీ రుణాలపై సీఎం అసత్య ప్రకటనలు చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని టీడీసీ సభ్యులు ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో కరువు పై చర్చ సందర్భంగా సభను సీఎం తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. దీంతో రెండవ రోజు కూడా కరువు పై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. అయితే నిన్ననే చర్చ […]

సీఎం జగన్‌ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2019 | 11:32 AM

Share

రెండవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ పై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. సున్నా వడ్డీ రుణాలపై సీఎం అసత్య ప్రకటనలు చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని టీడీసీ సభ్యులు ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో కరువు పై చర్చ సందర్భంగా సభను సీఎం తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. దీంతో రెండవ రోజు కూడా కరువు పై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. అయితే నిన్ననే చర్చ ముగిసిందని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. కాగా.. కరువు పై చర్చను కొనసాగించాలని సీఎం జగన్ కోరగా.. స్పీకర్ అందుకు అనుమతించారు. అదే సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మొదటిరోజు సభలో సీఎం జగన్ తీరు పై నిమ్మల రామానాయుడు విమర్శిస్తూ.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడిని ఆయన హేళన చేశారని వ్యాఖ్యానించారు. మీకు దమ్ముంటే సభ నుంచి రాజీనామా చేస్తారా అని సవాల్‌ చేశారు. వడ్డీలేని రుణాలు ఎంత మొత్తం ఇచ్చామన్నది రికార్డులతో సహా చూపిస్తున్నామని చెప్పారు. వడ్డీ లేని రుణాలు రద్దు చేశారని అసత్యాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. వడ్డీలేని రుణాల కింద 2013-14లో రూ.349 కోట్లు.. 2014-15లో రూ.44 కోట్లు.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.570 కోట్లు పెండింగ్‌లో ఉందని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఈ నిధులను విడుదల చేయాలని సీఎం జగన్‌ను కోరితే ఆయన నిరాకరించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

మరోవైపు తప్పుడు పత్రాలతో సభను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సభలో వ్యక్తిగత దూషణలు మానుకోవాలని ఆయన అన్నారు.

Follow Us
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..