అవిసె గింజలు ఆరోగ్యానికి కాదు అందానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్య, సౌందర్యానికీ సహాయపడతాయి. ఇవి చర్మానికి తగినంత తేమను అందించి చర్మాన్ని కోమలంగా మారుస్తాయి. చర్మకణాలలో పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. చర్మం పై మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించి చర్మ నిగారింపును పెంచుతాయి.