రంగులు మార్చండి…జగన్ సర్కార్ కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ కార్యాలయాల రంగులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే రంగులు మార్చాలని పంచాయతీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని ఆదేశాలిచ్చింది. భవనాలపై ఉన్న నీలం, ఆకుపచ్చ రంగుల్ని వెంటనే తొలగించాలని పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు ఖర్చు చేయాలని ఆదేశాల్లో తెలిపింది. గ్రామ సచివాలయాలన్నింటికీ హాఫ్ వైట్ వేయాలని… కింద రెండున్నర అడుగుల మేరకు ఎర్రమట్టిరంగు అంచు పూయాలని అందులో తెలిపారు. […]
గ్రామ పంచాయతీ కార్యాలయాల రంగులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే రంగులు మార్చాలని పంచాయతీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని ఆదేశాలిచ్చింది. భవనాలపై ఉన్న నీలం, ఆకుపచ్చ రంగుల్ని వెంటనే తొలగించాలని పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు ఖర్చు చేయాలని ఆదేశాల్లో తెలిపింది.
గ్రామ సచివాలయాలన్నింటికీ హాఫ్ వైట్ వేయాలని… కింద రెండున్నర అడుగుల మేరకు ఎర్రమట్టిరంగు అంచు పూయాలని అందులో తెలిపారు. ఆ అంచుపైన 8 అంగుళాల మేరకు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ముగ్గులు వేయాలని ఆదేశించారు.