ఏపీ డిగ్రీ, పీజీ పరీక్షలపై.. మంత్రి కీలక ప్రకటన..

ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కేంద్ర గైడ్‌లైన్స్ ప్రకారంగానే తుది నిర్ణయం ఉంటుందన్న ఆయన..

ఏపీ డిగ్రీ, పీజీ పరీక్షలపై.. మంత్రి కీలక ప్రకటన..
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 28, 2020 | 10:00 AM

ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కేంద్ర గైడ్‌లైన్స్ ప్రకారంగానే తుది నిర్ణయం ఉంటుందన్న ఆయన.. పరీక్షలు నిర్వహణ, సాధ్యాసాధ్యాలపై యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు, ఉన్నతాధికారులతో చర్చించి వారి నుంచి కీలక సూచనలను తీసుకున్నామని తెలిపారు. రెండు లేదా మూడు రోజుల్లో ఎగ్జామ్స్ నిర్వహణ విషయంపై వర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే డిగ్రీ, పీజీ పరీక్షలపై తుది నిర్ణయం వెలువడనుందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

విద్యార్థులకు టోల్ ఫ్రీ నెంబర్..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారీ బడుల రూపురేఖలను మార్చడానికి నాడు-నేడు కార్యక్రమం చేపట్టామన్నారు. వాటిని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ధేందుకు నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీలేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇక కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని త్వరలోనే పాఠశాలలను పున: ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. కాగా, విద్యార్థులకు ఎటువంటి డౌట్స్ నివృత్తి అయినా 1800-123-123-124 టోల్ ఫ్రీ నెంబర్‌కు సంప్రదించవచ్చునని సూచించారు.

ఇది చదవండి: టీఎస్ ఎంసెట్.. విద్యార్థులకు న్యూ ‘కరోనా’ రూల్..