కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా..!

వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపధ్యంలో ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టడం మంచిది కాదని

  • Tv9 Telugu
  • Publish Date - 8:00 am, Sat, 21 March 20
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా..!

వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపధ్యంలో ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టడం మంచిది కాదని నిర్ణయించుకున్న సీఎం జగన్.. ఇళ్ల పట్టాల పంపిణీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు ప్లాట్ల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్.. ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ రోజురోజుకు తీవ్రతరం అవుతోన్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం మంచిది కాదని భావించిన సీఎం.. ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఏప్రిల్ 14వ తేదీన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. లబ్ధిదారులు అందరికీ ఒకేసారి కాకుండా దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకొని వారికి ఇళ్ల సైట్లను చూపించాలని సీఎం అధికారులకు సూచించారు. కాగా అర్హులైన అందరికీ ఉగాది రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని వైసీపీ ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. కానీ స్థానిక ఎన్నికలను వాయిదా చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి..ఎన్నికల కోడ్ ఉండడంతో ఇళ్ల పట్టాల పంపిణీ చేయవద్దని సూచించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన సుప్రీం.. తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని ఆదేశించడంతో ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డంకులు తొలిగాయి. కానీ కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది.

Read This Story Also: షట్లర్‌కు కరోనా.. భయంలో ఇండియన్ ప్లేయర్లు..!