కరోనా ఎఫెక్ట్.. పెన్షన్ల పంపణీపై జగన్ కీలక నిర్ణయం..

COVID 19: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో జరగాల్సిన పింఛన్ల పంపణీలో బయోమెట్రిక్ విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకాలని నిర్ణయించింది. అయితే పారదర్శకత కోసం గ్రామ వాలంటీర్లు లబ్ధిదారుల నుంచి తమ పింఛను డబ్బులు ముట్టినట్టు సంతకాలు తీసుకోనున్నారు. ఇక నిరక్షరాస్యులైతే వారికి పింఛను డబ్బులు పంపిణీ చేసినట్టు ఓ ఫోటోను తీసుకుంటారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ […]

కరోనా ఎఫెక్ట్.. పెన్షన్ల పంపణీపై జగన్ కీలక నిర్ణయం..
Ravi Kiran

|

Mar 21, 2020 | 3:20 PM

COVID 19: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో జరగాల్సిన పింఛన్ల పంపణీలో బయోమెట్రిక్ విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకాలని నిర్ణయించింది. అయితే పారదర్శకత కోసం గ్రామ వాలంటీర్లు లబ్ధిదారుల నుంచి తమ పింఛను డబ్బులు ముట్టినట్టు సంతకాలు తీసుకోనున్నారు. ఇక నిరక్షరాస్యులైతే వారికి పింఛను డబ్బులు పంపిణీ చేసినట్టు ఓ ఫోటోను తీసుకుంటారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

బయోమెట్రిక్ విధానం వల్ల కోవిడ్ 19 వ్యాపించే అవకాశం ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. అటు రేషన్ సరుకుల విషయంలో కూడా ఈ- పాస్ యంత్రాలను వినియోగించకుండా పాత పద్దతిలోనే రికార్డు పుస్తకంలో నమోదు చేసుకుని సరుకులును లబ్దిదారులకు అందజేయనున్నారు.

కాగా, భారత్‌లో కరోనా వైరస్ చాప కింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 251కు చేరుకుంది. ఇక అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ 19 ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 19 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా… ఏపీలో మూడు నమోదయ్యాయి.

For More News:

డేంజర్ బెల్స్: తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు…

కరోనా భయం.. పీఎస్‌లో గోదావరి కుర్రాడు..

కరోనా వైరస్.. వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్లు..

కరోనా ప్రభావం.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్…

కరోనావైరస్: రసికప్రియులకు బ్యాడ్ న్యూస్.. ‘ప్లేబాయ్’ మ్యాగజైన్ బంద్..

Breaking.. బస్సులు, మెట్రో బంద్..

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. ఎబోలా కంటే ప్రమాదకర స్థాయికి..

‘ఈరోస్ నౌ’ బంపరాఫర్.. 2 నెలలు ఫ్రీ సినిమాలు…

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu