డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. ఎబోలా కంటే ప్రమాదకర స్థాయికి..

COVID 19: చరిత్రను చూస్తే మానవాళి ఇప్పటివరకు అనేక విపత్కర పరిస్థితులను, భయంకరమైన వైరస్‌లను ఎదుర్కొంది. సార్స్, మెర్స్ లాంటి వైరస్‌లతో పోరాడారు. ఇలాంటి మహమ్మారులను ఎదుర్కున్న మానవజాతి ఇప్పుడు ఆధునిక యుగంలో కోవిడ్ 19తో యుద్ధం చేస్తోంది. కంటికి కనిపించని శత్రువు అది.. ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలియదు.. ఏమరపాటుగా ఉంటే ప్రాణాలు పోయే స్టేజికి వెళ్ళిపోతాం. ఇప్పటికే ఈ కరోనా వైరస్ 183 దేశాలకు విస్తరించిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గతంలో ప్లేగు […]

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. ఎబోలా కంటే ప్రమాదకర స్థాయికి..
Follow us

|

Updated on: Mar 21, 2020 | 3:17 PM

COVID 19: చరిత్రను చూస్తే మానవాళి ఇప్పటివరకు అనేక విపత్కర పరిస్థితులను, భయంకరమైన వైరస్‌లను ఎదుర్కొంది. సార్స్, మెర్స్ లాంటి వైరస్‌లతో పోరాడారు. ఇలాంటి మహమ్మారులను ఎదుర్కున్న మానవజాతి ఇప్పుడు ఆధునిక యుగంలో కోవిడ్ 19తో యుద్ధం చేస్తోంది. కంటికి కనిపించని శత్రువు అది.. ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలియదు.. ఏమరపాటుగా ఉంటే ప్రాణాలు పోయే స్టేజికి వెళ్ళిపోతాం. ఇప్పటికే ఈ కరోనా వైరస్ 183 దేశాలకు విస్తరించిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది.

గతంలో ప్లేగు కారణంగా దాదాపు 20 కోట్ల మంది మరణించగా.. ఆ తర్వాత స్మాల్ పాక్స్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ వ్యాధితో దాదాపు 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక స్పానిష్ ఫ్లూతో 4-5 కోట్ల మంది వరకు మృత్యువాతపడ్డారు. ఇక ఇప్పుడు కరోనా ప్రభావం ప్రపంచంపై పడింది.

సార్స్, మెర్స్ వైరస్‌ను దాటేసింది.. ఎబోలాను సమీపించింది…

సార్స్, మెర్స్ వైరస్‌ల కారణంగా సంభవించిన మరణాల సంఖ్యను కరోనా దాటేసింది. 2002-03 మధ్యలో సార్స్ కారణంగా 700 మంది మృతి చెందగా.. మెర్స్‌తో 850 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిని దాటేసిన ఈ మహమ్మారి వైరస్ ఎబోలా కంటే ప్రమాదకరం మారుతోంది. ఎబోలాను మొదటిసారి 1976లో గుర్తించారు. దీని కారణంగా పశ్చిమ ఆఫ్రికాలో దాదాపు 11,300 మంది మరణించగా.. ఇప్పుడు కోవిడ్ 19 ఆ సంఖ్యకు చేరువైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 11,417 మంది మృతి చెందిన విషయం విదితమే.

For More News:

డేంజర్ బెల్స్: తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు…

కరోనా ఎఫెక్ట్.. పెన్షన్ల పంపణీపై జగన్ కీలక నిర్ణయం..

కరోనా భయం.. పీఎస్‌లో గోదావరి కుర్రాడు..

కరోనా వైరస్.. వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్లు..

కరోనా ప్రభావం.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్…

కరోనావైరస్: రసికప్రియులకు బ్యాడ్ న్యూస్.. ‘ప్లేబాయ్’ మ్యాగజైన్ బంద్..

Breaking.. బస్సులు, మెట్రో బంద్..

‘ఈరోస్ నౌ’ బంపరాఫర్.. 2 నెలలు ఫ్రీ సినిమాలు…

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్