జగన్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్…

COVID 19: జగన్ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖపట్నంలోని పాడేరు, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలలో ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ. 325 కోట్లను ఖర్చు […]

జగన్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్...
Follow us

|

Updated on: Mar 21, 2020 | 3:19 PM

COVID 19: జగన్ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖపట్నంలోని పాడేరు, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలలో ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ఆదేశాలను జారీ చేసింది.

మరోవైపు ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ. 325 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇలా మూడు కాలేజీలకు మొత్తంగా రూ. 975 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇందులో కేంద్రం వాటా 60 శాతం ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం ఉంటుందని మోదీ సర్కార్ నిర్ధారించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. కాగా, ఏపీలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలోనే కేంద్రం ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలను కేటాయించాలని నిర్ణయించింది.

For More News:

డేంజర్ బెల్స్: తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు…

కరోనా ఎఫెక్ట్.. పెన్షన్ల పంపణీపై జగన్ కీలక నిర్ణయం..

కరోనా భయం.. పీఎస్‌లో గోదావరి కుర్రాడు..

కరోనా వైరస్.. వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్లు..

కరోనావైరస్: రసికప్రియులకు బ్యాడ్ న్యూస్.. ‘ప్లేబాయ్’ మ్యాగజైన్ బంద్..

Breaking.. బస్సులు, మెట్రో బంద్..

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. ఎబోలా కంటే ప్రమాదకర స్థాయికి..

‘ఈరోస్ నౌ’ బంపరాఫర్.. 2 నెలలు ఫ్రీ సినిమాలు…

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్