డేంజర్ బెల్స్: తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు…

Coronavirus Effect: కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. అనుమానితులు, పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. ఇక తాజాగా రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో ఆ సంఖ్య 19కి చేరుకుంది. ఇటీవలే లండన్ నుంచి వచ్చిన 18 ఏళ్ల హైదరాబాద్ యువతి కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక కొద్దిరోజుల క్రిందట కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా బృందంలోని […]

డేంజర్ బెల్స్: తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు...
Follow us

|

Updated on: Mar 21, 2020 | 3:20 PM

Coronavirus Effect: కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. అనుమానితులు, పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. ఇక తాజాగా రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో ఆ సంఖ్య 19కి చేరుకుంది.

ఇటీవలే లండన్ నుంచి వచ్చిన 18 ఏళ్ల హైదరాబాద్ యువతి కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక కొద్దిరోజుల క్రిందట కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా బృందంలోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల్లో ఒకరు 27 ఏళ్ల యువకుడు కాగా.. మరొకరు 60 ఏళ్ల వ్యక్తి అని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వ్యాధిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, పార్క్‌లు, థియేటర్లను మూసివేయగా.. తాజాగా హైకోర్టు ఆదేశాలతో పదో తరగతి పరీక్షలను కూడా వాయిదా వేశారు.

For More News:

కరోనా ఎఫెక్ట్.. పెన్షన్ల పంపణీపై జగన్ కీలక నిర్ణయం..

కరోనా భయం.. పీఎస్‌లో గోదావరి కుర్రాడు..

కరోనా వైరస్.. వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్లు..

కరోనా ప్రభావం.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్…

కరోనావైరస్: రసికప్రియులకు బ్యాడ్ న్యూస్.. ‘ప్లేబాయ్’ మ్యాగజైన్ బంద్..

Breaking.. బస్సులు, మెట్రో బంద్..

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. ఎబోలా కంటే ప్రమాదకర స్థాయికి..

‘ఈరోస్ నౌ’ బంపరాఫర్.. 2 నెలలు ఫ్రీ సినిమాలు…

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్