Coronavirus: షట్లర్‌కు కరోనా.. భయంలో ఇండియన్ ప్లేయర్లు..!

కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కుల, మత, ప్రాంత, భాష తేడా లేకుండా ఈ వ్యాధి అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. సామాన్యులే కాదు పలువురు సెలబ్రిటీలకు సైతం ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది.

  • Tv9 Telugu
  • Publish Date - 7:00 am, Sat, 21 March 20
Coronavirus: షట్లర్‌కు కరోనా.. భయంలో ఇండియన్ ప్లేయర్లు..!

కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కుల, మత, ప్రాంత, భాష తేడా లేకుండా ఈ వ్యాధి అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. సామాన్యులే కాదు పలువురు సెలబ్రిటీలకు సైతం ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లిన పలువురు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తైవాన్‌కు చెందిన పదేళ్ల షెట్లర్‌కు కరోనా సోకింది. దీంతో భారత షెట్లర్‌లు షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే ఆ ప్లేయర్‌ ఇటీవల ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో ఆ టోర్నీలో పాల్గొన్న భారత షట్లర్‌లలో భయం పట్టుకుంది. ఆల్ ఇంగ్లాండ్ చాంపియ‌న్‌షిప్‌లో జ‌ట్టుతో సదరు ప్లేయర్‌ సన్నిహితంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. హోటల్‌ నుంచి మ్యాచ్‌ వేదికలకు బస్సులో ప్లేయర్లతో కలిసి అతను ప్రయాణించినట్లు సమాచారం. కాగా ఈ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశేణి ప్లేయర్లు సైనా, పీవీ సింధు ఆడారు.

ఈ నేపథ్యంలో సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. నిజంగా షాక్‌కు గురయ్యానంటూ ఆమె ట్వీట్ చేశారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌నపై భారత ప్లేయర్లు అశ్విని పొన్న‌ప్ప‌, అజ‌య్ జ‌య‌రామ్, పారుపల్లి కశ్యప్ తదిత‌రులు విచారం వ్య‌క్తం చేశారు. ఇక ఈ వార్త తెలిసి.. ఆ టోర్నీలో పాల్గొన్న మిగిలిన దేశాల ప్లేయర్లు సైతం షాక్‌కు గురవుతున్నారు. కాగా ఈ నెల 11 నుంచి 15వరకు ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జరిగింది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ టోర్నీని నిర్వ‌హించ‌డంపై చాలామంది ప్లేయ‌ర్లు మండిపడిన విషయం తెలిసిందే.